YSR Rythu Bharosa Funds : రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. 15న ఖాతాల్లోకి డబ్బులు

ఏపీలో రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను ఈ నెల..(YSR Rythu Bharosa Funds)

YSR Rythu Bharosa Funds : రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. 15న ఖాతాల్లోకి డబ్బులు

Ysr Rythu Bharosa

YSR Rythu Bharosa Funds : ఏపీలో రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను ఈ నెల 15న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తొలి విడతగా రైతు అకౌంట్ లో రూ.5వేల 500 చొప్పున జమ చేయనున్నారు. ఈ ఏడాది మొత్తం 48.77 లక్షల మందిని రైతు భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.

అర్హుల జాబితాను ఆర్బీకేల్లో అధికారులు ప్రదర్శించారు. జాబితాపై వచ్చే అభ్యంతరాలను ఈ నెల 8 నుంచి పరిశీలిస్తారు. ఎవరైనా అనర్హులుంటే వారి పేర్లను తొలగించడంతో పాటు జాబితాలో చోటు దక్కని అర్హుల అభ్యర్థనలను స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత వారికి భరోసా సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు.(YSR Rythu Bharosa Funds)

Input Subsidy : రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. రేపే ఖాతాల్లోకి డబ్బులు

రైతు భరోసా స్కీమ్ కింద ప్రభుత్వం అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఈ సంవత్సరం మొత్తం 48.77 లక్షల మందిని రైతు భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 47.86 లక్షల మంది భూ యజమానులు కాగా, 91 వేల మంది అటవీ భూ సాగుదారులున్నారు.

YSR Rythu Bharosa : రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి

వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి భూ యజమానులకు ప్రతి సంవత్సరం మూడు విడతల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మిగిలిన రూ. 7,500 జగన్ సర్కార్ అందిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద మే 15న రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న ఒక్కో రైతు అకౌంట్‌లో రూ. 5,500 చొప్పున జమ చేయనుంది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఈసారి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే మే నెలలోనే వైఎస్సార్‌ రైతు భరోసా నగదు అర్హులైన రైతులందరి ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై వ్యవసాయాధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందే రైతు ఏదైనా కారణంతో మరణిస్తే ఆ నగదు అదే ఇంట్లోనే మరొకరికి అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు కూడా ఈసారి రైతు భరోసాకు అర్హులయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది.(YSR Rythu Bharosa Funds)

రైతు భరోసా పొందడం ఎలా?
* భూమి ఉన్న ప్రతి రైతూ ఈ పథకానికి అర్హులే.
* ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద ప్రయోజనం పొందే వారందరూ ఈ పథకానికి అర్హులే.
* పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డుతో పాటు బ్యాంకు పాసు పుస్తకం తీసుకొని సమీప రైతుభరోసా కేంద్రంలో సంప్రదిస్తే సరిపోతుంది.
* లేదంటే వాలంటీర్‌ను కానీ, గ్రామ సచివాలయంలో కానీ, వ్యవసాయాధికారిని కానీ సంప్రదించవచ్చు.
* ఈ పథకం ద్వారా మొత్తం 13వేల 500 రూపాయలు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇందులో రూ.2 వేలు చొప్పున మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం జమ చేయగా, దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7,500 జమ చేస్తుంది.