Input Subsidy : రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. రేపే ఖాతాల్లోకి డబ్బులు

రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేయనున్నారు సీఎం జగన్. 2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు.

Input Subsidy : రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. రేపే ఖాతాల్లోకి డబ్బులు

Input Subsidy

Input Subsidy : ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. మరోమారు అన్నదాతలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం (ఫిబ్రవరి 15) రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేయనున్నారు సీఎం జగన్. 2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు జమ చేయనున్నారు. రాష్ట్రంలోని 5,71,478 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా లబ్ధి చేకూరనుంది. రైతుల ఖాతాల్లో రూ.534.77 కోట్లు జమ చేయనున్నారు.

Drinking Water : పరగడుపున నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు

దీని ద్వారా 1220 రైతు గ్రూపులకు వైఎస్ఆర్ యంత్రసేవా పథకం కింద 29.51 కోట్ల లబ్ధి చేకూరనుంది. ఇన్‌పుట్‌ సబ్సిడీ, యంత్ర సేవా పథకం కలిపి మొత్తం 564.28 కోట్లు పంపిణీ చేయనున్నారు. సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు రూ.1,612 కోట్ల సాయం అందించారు.

Vivo New Smartphone: వివో నుంచి T1 5G స్మార్ట్ ఫోన్, ధర, ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి?

ఏ సీజన్ లో జరిగిన నష్టానికి అదే సీజన్ లో నష్టపరిహారం చెల్లిస్తున్నామని జగన్ తెలిపారు. అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని వెల్లడించారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బకాయిలను కూడా ఈ ప్రభుత్వం తీర్చిందని జగన్ గుర్తు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని జగన్ భరోసా ఇచ్చారు. ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. రైతులకు అండగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.