AP CM YS Jagan
YSR Nethanna Nestham: రాష్ట్రంలోని నేతన్నలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా నేడు వరుసగా నాల్గో ఏడాది నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పెడనలో జరిగే సభలో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
YSR Nethanna Nestham : చేనేతకు చేయూత.. నేడు లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.24 వేలు
నాల్గో ఏడాది పథకం అమలులో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్లను సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేయనున్నారు. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24,000 ఆర్ధిక సాయాన్ని వైసీపీ ప్రభుత్వం అందిస్తోంది. నేడు అందిస్తున్న రూ. 193.31 కోట్లతో కలిపి ఇప్పటివరకూ నేరుగా నేతన్నలకు ఈ పథకం ద్వారా మొత్తం సాయం రూ. 776.13 కోట్లు అందినట్లవుతుంది.
YSR Nethanna Nestham : ప్రభుత్వం గుడ్‌న్యూస్, 10న వారి ఖాతాల్లోకి రూ.24వేలు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి వైఎస్సార్ నేతన్న నేస్తం క్రింద రూ. 776.13 కోట్లు, నేతన్నల పెన్షన్ కోసం రూ. 879.8 కోట్లు, ఆప్కోకు చెల్లించింది రూ. 393.3 కోట్లు.. ఇలా మొత్తంగా మూడేళ్ళలో నేతన్నల సంక్షేమం కోసం రూ. 2,049.2 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. నేతన్నలు తమ కాళ్ళమీద తాము నిలబడేలా ప్రతీయేటా అదే కుటుంబానికి ప్రభుత్వం ఆర్ధికసాయం అందిస్తుంది. నేతన్నలకు ఆర్థికంగా తోడుగా నిలుస్తూ చేనేత వృత్తిని గిట్టుబాటు అయ్యేలా ప్రభుత్వం కృషిచేస్తోంది. నేడు అందిస్తున్న సాయంతో కలిపి అర్హులైన ప్రతి నేతన్నకు ప్రభుత్వం రూ. 96,000 సాయం అందించినట్లవుతుంది.