CM Jaganmohan Reddy
AP Cm YS Jagan : ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) నేటి నుంచి మూడు రోజులపాటు అనంతపురం (Anantapur), వైఎస్ఆర్ జిల్లా (YSR district) ల్లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం అనంతపురం జిల్లాకు సీఎం జగన్ వెళ్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో నిర్వహించే వైఎస్ఆర్ రైతు దినోత్సవంలో పాల్గొంటారు. ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకొని డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 2022- ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 10.2లక్షల మంది రైతులకు రూ.1,117 కోట్ల బీమా పరిహారం విడుదల చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లా వెళ్తారు. 10వ తేదీ వరకు ఆ జిల్లాలోనే జగన్ పర్యటన కొనసాగుతుంది.
YSR 74th jayanthi : వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్.. ఏమన్నారంటే..
అనంతపురం జిల్లా పర్యటన అనంతరం ఈరోజు మధ్యాహ్నం సీఎం జగన్ నేరుగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లారు. అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పిస్తారు. 9వ తేదీ 9.30గంటలకు గండికోట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. అక్కడ వ్యూ పాయింట్ ను పరిశీలిస్తారు. ఆ తరువాత పులివెందుల చేరుకొని నూతనంగా నిర్మించిన మున్సిపల్ ఆపీసు భవనాన్ని, రాణితోపులో నగరవనాన్ని, గరండాల రివర్ ఫ్రెంట్ వద్ద కెనాల్ డెవలప్మెంట్ ఫేజ్-1 పనులను, పులివెందులలో నూతనంగా నిర్మించిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, ఏపీ కార్ల్ లో న్యూటెక్ బయో సైన్సెస్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమికి ప్రారంభోత్సవం చేస్తారు. సాయంత్రం తిరిగి ఇడుపుల పాయకు చేరుకుంటారు.
PM Modi Warangal Tour: 29ఏళ్ల తరువాత..! ఓరుగల్లుకు ప్రధాని నరేంద్ర మోదీ .. టూర్ షెడ్యూల్ ఇలా..
10వ తేదీ ఉదయం 9గంటలకు కడపలోని రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభిస్తారు. అనంతరం కొప్పరి పారిశ్రామిక వాడలో అల్ డిక్సన్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, అదేవిధంగా కొప్పర్తిలో పలు పారిశ్రామిక యూనిట్లకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు.