YSR 74th jayanthi : వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్.. ఏమన్నారంటే..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ట్విటర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు..

CM YS Jagan
CM Jagan: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 74వ జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు, వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్‌కు నివాళులర్పిస్తున్నారు. ఇడుపుల పాయలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ చేరుకుంటారు. అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ఇదిలాఉంటే, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఇడుపుల పాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఘాట్ వద్ద వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులర్పించనున్నారు.
CM Jagan : ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో కీలక అంశాలపై చర్చ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ట్విటర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతిఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా.. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది.. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు. అంటూ వైఎస్ ట్వీట్ చేశారు.
ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక… pic.twitter.com/KsdlyNd2uM
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 7, 2023