జల సిరులు : సోమశిల రెండో దశకు శ్రీకారం

  • Publish Date - November 9, 2020 / 07:03 AM IST

CM to launch second phase of Somasila canal project : సోమశిల రిజర్వాయర్‌ జలాలతో నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సోమశిల హైలెవల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ రెండో దశ పనులకు 2020, నవంబర్ 09వ తేదీ సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు.



46,453 ఎకరాలకు నీళ్లు : –
ఈ దశలో దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి మండలాల్లోని 46,453 ఎకరాలకు నీళ్లందించనున్నారు. నెల్లూరు జిల్లాలో వర్షాభావ ప్రాంతంలో ఉన్న అనంతసాగరం, మర్రిపాడు, వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి, ఆత్మకూరు మండలాల్లో సాగు, తాగునీటి కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమశిల జలాశయం నుంచి నీటిని ఎత్తిపోయనున్నారు.



https://10tv.in/chandrababu-gives-promotion-for-tdp-leader-abdul-aziz/
SHLLC : –
తాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు ఈ మండలాల్లో 90 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తొలి దశ కింద 43,547 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. ఇందుకోసం 840.72 కోట్ల పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఇప్పటివరకు 572.11 కోట్లను ఖర్చు చేసింది.



తక్కువ వడ్డీకే రుణాలు : –
SHLLC తొలి దశలో మిగిలిన పనులతో పాటు రెండో దశ పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. అందులో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించింది. బడ్జెట్‌లో నిధుల కేటాయింపులకుతోడు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి వేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది.