Cm Chandrababu Challenge: వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అని అడిగారు. అసెంబ్లీకి వస్తే కీలక అంశాలపై చర్చకు నేను సిద్ధం అని చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. లబ్దిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ టార్గెట్ గా చంద్రబాబు నిప్పులు చెరిగారు.
”సిద్ధం సిద్ధం అని నినాదాలు చేసిన వారికి సవాల్ విసురుతున్నా. వైసీపీని సూటిగా అడుగుతున్నా. అసెంబ్లీకి వచ్చేందుకు వైసీపీ సిద్ధమా? అసెంబ్లీకి రండి.. ఎవరిది విధ్వంసమో.. ఎవరిది అభివృద్ధో.. సంక్షేమం ఎవరు అందించగలరో చర్చకు నేను సిద్ధం. వైసీపీ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధం. చర్చించడానికి వైసీపీ సిద్ధమా..?” అని చంద్రబాబు సవాల్ చేశారు.
”బాబాయ్ హత్యపై చర్చకు సిద్ధం. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలపై చర్చకు సిద్ధం. దళిత డ్రైవర్ ను డోర్ డెలివరీ చేసిన ఘటనపై చర్చకు సిద్ధం. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాలపై చర్చకు సిద్ధం. క్లైమోర్ మైన్లతో పేల్చినా నేను చలించలేదు. నేను మీలా డ్రామాలు ఆడడం లేదు” అని సీఎం చంద్రబాబు అన్నారు.
అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా, చర్చకు నేను సిద్ధం అంటూ వైసీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు విసిరిన సవాల్.. ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచింది. సీఎం చంద్రబాబు సవాల్ పై జగన్ స్పందిస్తారా? జగన్ రియాక్షన్ ఏంటి? చంద్రబాబు ఛాలెంజ్ ని వైసీపీ చీఫ్ యక్సెప్ట్ చేస్తారా? అనేది హాట్ టాపిక్ గా మారింది.
Also Read: చంద్రబాబు అన్‌స్టాపబుల్.. తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి 30ఏళ్లు