Cyclone : ఏపీకి బిగ్ అలర్ట్! మూడు రోజులు భారీ వర్షాలు

ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. శనివారం అండమాన్ నికోబార్ తీరం, థాయ్‌లాండ్ వద్ద ఏర్పడిన అల్పపీడనం ... ఈ నెల 15న వాయుగుండంగా మారింది.

Cyclone Gulab Effect In Andhra Pradesh

Cyclone : ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. శనివారం అండమాన్ నికోబార్ తీరం, థాయ్‌లాండ్ వద్ద ఏర్పడిన అల్పపీడనం … ఈ నెల 15న వాయుగుండంగా మారింది. వాయుగుండం మరింత బలపడి 17 తేదికి తుఫాన్‌‌గా మారింది..ఇది ఏపీలో తీరం దాటనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 17,18,19 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు.

చదవండి : Cyclone Jawad : ఏపీకి మరో తుపాన్ ముప్పు..భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక

ప్రస్తుతం ఏపీ తీరానికి కొద్దీ దూరంలో వాయుగుండం ఉంది. ఈ తుఫాన్‌కి “జవాద్‌”గా నామకరణం చేశారు. దీని ప్రభావం దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటికే అకాల వర్షాలతో పంట నష్టం చాలా జరిగింది. ఈ తుఫాను కారణంగా మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

చదవండి : Jawad cyclone : ‘జవాద్’ తుపానుకు అర్థం ఇదే..

వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఇక ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని వివరించారు.