Cyclone Jawad : ఏపీకి మరో తుపాన్ ముప్పు..భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీకి మరో తుపాను ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది.

Cyclone Jawad : ఏపీకి మరో తుపాన్ ముప్పు..భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక

Ap Cyclone

Cyclone Jawad : ఏపీకి మరో తుపాను ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. సోమవారం ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని పేర్కొంది. క్రమంగా తుపానుగా కూడా మారే అవకాశముందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఆ తుపానుకు ‘జవాద్‌’ అని పేరు పెట్టనున్నారు. ఈ తుపాను ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, నెల్లూరు జిల్లాల్లో ఆదివారం కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని  వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read More : AP : స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్, కోవిడ్ నిబంధనలు పాటించాలి

భారీ వర్షాలతో ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు స్మార్ట్ సిటీ తిరుపతి నీట మునిగింది. ఫ్లైఓవర్‌ నిర్మాణం కారణంగా చాలాచోట్ల బారికేడ్లు పెట్టడంతో నీళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

Read More : TPT : దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం

నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, విడవలూరు, కావలిలో కుండపోతగా వర్షం కురిసింది. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మనుబోలు పెద్ద చెరువు, సైదాపురం కలిచేడు చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోమశిల, వాకాడు స్వర్ణముఖి జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి.