AP : స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్, కోవిడ్ నిబంధనలు పాటించాలి

ఏపీలో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు 2021, నవంబర్ 14వ తేదీ ఆదివారం, సోమవారం, మంగళవారం జరగనున్నాయి.

AP : స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్, కోవిడ్ నిబంధనలు పాటించాలి

Ap Local Body

AP Local Body Elections : ఏపీలో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు 2021, నవంబర్ 14వ తేదీ ఆదివారం, సోమవారం, మంగళవారం జరగనున్నాయి. ఆదివారం ఉయం ఏపీలో మిగిలిపోయిన గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ మొదలైంది. ఆదవారం సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తారు. మిగిలి పోయిన 4వందల 98 గ్రామ పంచాయతీల్లో 69 సర్పంచ్‌లకు, 533 వార్డు మెంబర్లకు ఎన్నిక జరుగుతోంది. అలాగే సోమవారం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 17న ఓట్లు లెక్కిస్తారు.

Read More : TPT : దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం

ఇందులో భాగంగా 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు ఎన్నిక జరుగనుంది. ఇక మంగళవారం మిగిలిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటికి ఈ నెల 18న ఓట్ల కౌంటింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో భాగంగా 13 జిల్లాల్లో మిగిలిన 187 ఎంపీటీసీలకు,16 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన కోవిడ్‌ నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కీలక ఆదేశాలు జారీ చేశారు.

Read More : Israel : ఇక క్షిపణులు అవసరం లేదు..లేజర్ కిరణాలతో

కోవిడ్ నిబంధనలు పాటించని వారిని పోలింగ్ కేంద్రాల్లోని అనుమతి వద్దని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఓటర్లను మాస్కు లేకుండా పోలింగ్‌ స్టేషన్‌లో ఓటు వెయ్యడానికి అనుమతించద్దని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు గుమిగూడకూడదన్నారు. కౌంటింగ్‌ సమయంలో కూడా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అలాగే ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒకరు మాస్కు, సానిటైజరు ఉపయోగించాలని సూచించారు నీలం సాహ్నీ.