TPT : దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం
తిరుపతిలోని తాజ్‌హోటల్‌లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. అనంతరం అతిథుల గౌరవార్థం ఏపీ సీఎం జగన్ విందు ఇవ్వనున్నారు.

Amit
Southern Zonal Council Meet : తిరుపతిలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి సర్వం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. తిరుపతిలోని తాజ్‌హోటల్‌లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. అనంతరం అతిథుల గౌరవార్థం ఏపీ సీఎం జగన్ విందు ఇవ్వనున్నారు. అమిత్‌షా నిన్న సాయంత్రమే తిరుపతి చేరుకున్నారు. సీఎం జగన్ ఆయనకు స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని ఇద్దరూ దర్శించుకున్నారు.
Read More : Boat Service : శ్రీశైలానికి బోట్ సర్వీసు తాత్కాలికంగా నిలిపివేత
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి హాజరవడంలేదని.. హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్ వస్తున్నట్టు సమాచారం. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదివారం సొంత నియోజకవర్గం పర్యటనకు వెళుతున్నందున రావడం లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఇవాళ ప్రత్యేక విమానంలో తిరుపతికి రానున్నారు. కేరళ నుంచి ఆర్థిక మంత్రి, సీఎస్ హాజరవుతున్నారు. లక్షద్వీప్ పరిపాలనాధికారి, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, సీఎస్‌లు, ముఖ్య అధికారులు శనివారమే తిరుపతికి చేరుకున్నారు. పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి హాజరుకానున్నారు.
Read More : Israel : ఇక క్షిపణులు అవసరం లేదు..లేజర్ కిరణాలతో
దక్షిణాది ప్రాంతీయ మండలి 29వ సమావేశం ఎజెండాలో మొత్తం 26 అంశాల్ని పొందుపరిచారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన చర్యల నివేదికలు రెండింటితోపాటు 24 కొత్త అంశాల్ని చర్చకు చేపడతారు. ఇందులో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలు ఏడున్నాయి. మూడు రాజధానుల సమగ్రాభివృద్ధికి కేంద్రం ఉదారంగా నిధులివ్వాలని, గతంలో ఇస్తామని చెప్పిన 2వేల 500 కోట్లలో మిగతా వెయ్యి కోట్లను విడుదల చేయాలని కోరనుంది.