Israel : ఇక క్షిపణులు అవసరం లేదు..లేజర్ కిరణాలతో

విమానాలు, డ్రోన్లు కూల్చేందుకు రాకెట్ లు, క్షిపణులు ఉపయోగిస్తుంటాయి. అయితే..ఇజ్రాయెల్ దేశం అత్యాధునిక ఆయుధ వ్యవస్థను రూపొందించింది.

Israel : ఇక క్షిపణులు అవసరం లేదు..లేజర్ కిరణాలతో

Israel

Laser Based Missile : టెక్నాలజీ రోజు రోజుకు వృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీని క్యాష్ చేసుకోవాలని పలు దేశాలు ప్రయత్నిస్తుంటాయి. ప్రధానంగా రక్షణరంగ వ్యవస్థలో కొత్త కొత్త ఆయుధాలను తయారు చేస్తూ..దేశ భద్రతను కాపాడుకుంటుంటాయి. శత్రుదేశాల గుండెల్లో అదిరేలా పలు ఆయుధసంపత్తిని తయారు చేస్తుంటాయి. తమ దేశ భూభాగంపైకి వచ్చేందుకు ప్రయత్నించే విమానాలు, క్షిపణులను కూల్చేందుకు నూతన టెక్నాలజీని వాడుతున్నాయి. విమానాలు, డ్రోన్లు కూల్చేందుకు రాకెట్ లు, క్షిపణులు ఉపయోగిస్తుంటాయి. అయితే..ఇజ్రాయెల్ దేశం అత్యాధునిక ఆయుధ వ్యవస్థను రూపొందించింది. క్షిపణులతో కాకుండా…లేజర్ కిరణాలను రూపొందించింది.

Read More : Naradisti Cap : కొత్త రకం క్యాప్..దిష్టి తగలదంట!

ఇజ్రాయెల్ కు చెందిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ ‘ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్’ కొత్త ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థను ప్రకటించింది. యుద్ధ విమానాలు, నౌకలతో ప్రత్యర్థులు దాడి చేస్తే..ఆ ముప్పును ముందే పసిగట్టే విధంగా దీనిని రూపొందించడం విశేషం. వెంటనే అవి పనిచేయకుండా చేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. దీనిని స్కార్పియస్ ఆయుధ కుటుంబంగా పిలుస్తున్నారు. ఈ విప్లవాత్మక యుద్ధ వ్యవస్థలో డ్రోన్లు, ప్రత్యర్థుల యుద్ధ నౌకలు, రాడార్ వ్యవస్థలను పేల్చేయడానికి లేజర్ కిరణాలను పంపిస్తుంటారు. అవి..వాటి విద్యుత్ అయస్కాంత వ్యవస్థల పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. వాటిలో రాడార్లు, సెన్సర్లు, నావినేగేషన్ పని చేయకుండా చేస్తాయి.