Naradisti Cap : కొత్త రకం క్యాప్..దిష్టి తగలదంట!

ప్రజల నమ్మకాన్ని పసిగట్టిన ‘వెజ్ అండ్ నాన్ వెజ్’ అనే ఓ సంస్థ కొత్త వ్యాపారం చేపట్టింది. నజర్ సింబల్ ను క్యాప్ లపై ముద్రించి మార్కెట్ లోకి విడుదల చేసింది.

Naradisti Cap : కొత్త రకం క్యాప్..దిష్టి తగలదంట!

Naradisti

Updated On : November 14, 2021 / 7:06 AM IST

Nara Disti Cap : నరదిష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుందంటారు పెద్దలు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి….థూ.థూ..థూ అంటూ.. దిష్టి తీయడం చూసే ఉంటాము. నరదిష్టి తగలొద్దంటూ…ఎన్నో పనులు చేస్తుంటారు. ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు, దుకాణాలు..నిర్మాణాలు జరిగే సమయంలో..పెద్ద పెద్ద దిష్టిబొమ్మలు పెడుతుంటారు. ఎదుటి వారి కళ్లు..పడొద్దని..తమకు నరదిష్టి సోకద్దంటూ..ఈ ఫొటోలు పెడుతుంటారు. ఆఖరికి కొత్త కొత్త వాహనాలు కొన్ని సమయంలో కూడా..పూజలు చేసి బొమ్మలు పెట్టుకుంటారు.

Read More : Mumbai : ఇద్దరి మధ్య ప్రేమ..ప్రియుడి మాటలు నమ్మి లింగ మార్పిడి చేసుకున్నాడు

నరదిష్టిపై ప్రజలపై ఉన్న నమ్మకాన్ని కొంతమంది క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఫలానా ఫొటో పెట్టుకోవాలని..ఆ పని చేయాలంటూ..చెబుతుంటారు. తాజాగా..ప్రజల నమ్మకాన్ని పసిగట్టిన ‘వెజ్ అండ్ నాన్ వెజ్’ అనే ఓ సంస్థ కొత్త వ్యాపారం చేపట్టింది. నజర్ సింబల్ ను క్యాప్ లపై ముద్రించి మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ క్యాప్ పెట్టుకుంటే..మీకు దిష్టి తగలదంటూ..ప్రచారం చేపట్టింది. క్యాప్ పెట్టుకోవడం వల్ల..మీ శక్తి మరింత రెట్టింపు అవుతుందని చెబుతూ నినాదం రూపొందించింది.

Read More : Father Kills Daughter : కూతురినే కిడ్నాప్ చేసిన తండ్రి.. కొడుకుతో కలిసి..

కొత్తదనంతో ఉన్న ఈ క్యాప్ పైగా దిష్టితో కూడిన బొమ్మ ఉండడంతో వీటిని కొనేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారంట. ప్రస్తుతం ఈ క్యాప్ లు మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. దీని ధర రూ. 500గా ఉంది. తమకు క్యాప్ లు పంపించాలంటూ..వెబ్ సైట్ లో ఆర్డర్ పెడుతున్నారంట.