Commmercial Festival
Vijayawada Commercial Fest : రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ,రేపు విజయవాడలో వాణిజ్య ఉత్సవం-2021 నిర్వహిస్తోంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ వాణిజ్య ఉత్సవం ప్రారంభించనున్నారు. ఉదయం పదిన్నరకు ఎగుమతుల సదస్సు ప్రారంభం కానుంది. ఏపీ ఎగుమతులకు ఉన్న అవకాశాలను ఈ రెండు రోజుల సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ఎగుమతిదారులకు వివరించనున్నారు.
ఏపీ నుంచి అత్యంత చౌకగా ఎగుమతులు చేసుకునే అవకాశాలను ఎగుమతుదారులకు వివరించేలా ప్రణాళికలను ఏపీ ఈడీబీ సిద్ధం చేసింది. ప్రసుత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు ఓడరేవుల ద్వారా 16.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు అవుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ఏపీ ముందడుగు వేస్తోంది.