Telangana Congress Leaders: తెలంగాణ కాంగ్రెస్‌లో కమ్యూనికేషన్ గ్యాప్..! ఏం జరుగుతోంది?

Telangana Congress Leaders: కోఆర్డినేషన్ మిస్‌ అవ్వడం వల్లే గ్యాప్ వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

CM Revanth Reddy

Telangana Congress Leaders: కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు గమ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇస్తారో..ఎందుకు ఆల్‌ ఆఫ్ సడెన్‌గా చెక్ పెడుతారో అంతుచిక్కడం కష్టమే. కాంగ్రెస్ అంటేనే హైకమాండ్. ఏం చేయాలన్న అధిష్టానం అనుమతి తప్పనిసరి. తెలంగాణ కాంగ్రెస్‌ కూడా హైకమాండ్ కనుసన్నల్లోనే నడుచుకోవాల్సి ఉంటుంది. నడుచుకుంటుంద కూడా.

అధిష్టానం సీరియస్?

కానీ కొన్నిసార్లు తమకు చెప్పుకుండా స్టేట్‌ లీడర్లు నిర్ణయాలు తీసుకోవడంపై సీరియస్ అవుతోందట అధిష్టానం. ఎవరు చెప్తే చేశారు..ఎవరి ఈ డెసిషన్ తీసుకున్నారు..ఎవరికి చెప్పారని క్వశ్చన్‌ చేస్తోందట. సీఎం రేవంత్‌, పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్‌ కలిసి తీసుకుంటున్న పలు నిర్ణయాలకు హైకమాండ్‌ బ్రేకులు వేస్తోందట. చివరకు రాష్ట్ర పార్టీ ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు కూడా ఇన్ఫర్మేషన్‌ ఇవ్వకకుండా డెసిషన్స్ తీసుకోవడం ఏంటని ఆరా తీస్తోందట.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో ధర్నా చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అయితే ధర్నా విషయం ముందుగా హైకమాండ్‌కు చెప్పి అనుమతి తీసుకోలేదట.

పైగా ఈ సబ్జెక్ట్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి అత్యంత ఇష్టమైంది కాబట్టి..ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా చెల్లుబాటు అవుతాయని టీ.కాంగ్రెస్ నేతలు (Telangana Congress Leaders) ఆలోచన చేశారట. అందుకే ఢిల్లీ కేంద్రంగా మొదటగా బీసీ సంఘాల నేతలతో పెద్దఎత్తున ధర్నా చేయించారు.

ఈ ధర్నాకు రాహుల్‌గాంధీ వస్తారని అంతా భావించారు. కానీ రాహుల్ ఢిల్లీలోనే ఉండి కూడా రాలేదు. ఇక ఈ మధ్యకాలంలో బీసీ రిజర్వేషన్ పెంపు కోసం చివరి ప్రయత్నం అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా పెద్ద ఎత్తున ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టారు.

Also Read: మహిళల కోసం గేమ్‌ ఛేంజర్‌లాంటి పథకాలు.. చంద్రబాబు వ్యూహం ఇదేనా?

ఈ కార్యక్రమానికి రాహుల్‌తో సహా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంకగాంధీ కూడా రాలేదు. ఆల్ ఆఫ్ సడెన్‌గా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుని..ఢిల్లీ ధర్నా కార్యక్రమంపై కూడా అధిష్టానానికి ముందస్తు సమాచారం ఇవ్వలేదట. ఇక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత చెప్పారట. అందుకే అధిష్టానానికి ఝలక్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది.

సేమ్ సీన్ రిపీట్

ఇక ఇప్పుడు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం విషయంలో కూడా సేమ్ రిపీట్ అయ్యిందనే చర్చ సాగుతోంది. లోకల్ బాడీ ఎన్నికలను సాధ్యమైనంత తొందరగా నిర్వహించాలని..ముందుగా పార్టీలో చర్చించి..ప్రభుత్వపరంగా డెసిషన్ తీసుకోవాలని భావించారట. అందుకోసం పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మకమైన కమిటీ పీఏసీని ఈ నెల 16 లేదా 17 నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయాన్ని సీఎం రేవంత్‌తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చించిన తర్వాత గాంధీభవన్ వర్గాలు అఫీషియల్‌గా ప్రకటించాయి. కానీ తీరా పీఏసీ సమావేశం కూడా వాయిదా పడింది. ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్ బిజీ షెడ్యూల్ కారణంగా..తెలంగాణకు రాలేకపోతున్నట్లు ప్రకటించారు. ఇంచార్జ్‌ లేకుండా పార్టీ పీఏసీ సమావేశం పెట్టడం కుదరదు కాబట్టి..సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు.

మీనాక్షి మీటింగ్‌ను వాయిదా పడేలా చేశారా?

అయితే పీఏసీ సమావేశం పెట్టాలన్న నిర్ణయం కూడా ఇంచార్జ్ మీనాక్షితో చర్చించకుండానే రాష్ట్ర నేతలు నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే ఇంచార్జ్ మీనాక్షి మీటింగ్‌ను వాయిదా పడేలా చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 21న తెలంగాణకు వస్తానని..22న పీఏసీ మీటింగ్ పెట్టుకోవాలని ఆమె డిసైడ్ చేశారట.

ఇలా రాష్ట్ర నేతలు ఒకటి తలిస్తే అధిష్టానం మరొకటి తలుస్తుందట. అధిష్టానాన్ని బైపాస్ చేసి సీఎం రేవంత్, పీసీసీ చీఫ్‌ నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ పెద్దలకు నచ్చడం లేదట. కోఆర్డినేషన్ మిస్‌ అవ్వడం వల్లే గ్యాప్ వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉంటే రేవంత్‌ను సంప్రదించకుండా పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌తో కలిసి మీనాక్షి పాదయాత్ర చేయడం కూడా హాట్ టాపిక్‌ మారింది. పైగా పార్టీ ఇంచార్జ్ పాదయాత్ర చేస్తే రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయని రేవంత్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మీనాక్షి ససేమిరా అన్నరని అంటున్నారు. ఈ కమ్యూనికేషన్‌ గ్యాప్‌ను ఎలా సెట్ చేస్తారో చూడాలి మరి.