Flood Water : శ్రీశైలంకు పూర్తిగా నిలిచిపోయిన వరద.

శ్రీశైలం ప్రాజెక్టుకు శనివారం వరకు 4వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చింది. అయితే ఆదివారానికి పూర్తిగా వరద నీరు నిలిచిపోయింది. ఇక ఎగువ నుంచి వరద ఆగిపోవడంతో దిగువకు నీటి విడుదలను నిలిపివేశారు అధికారులు.

Flood Water

Flood Water : ఈ నెల ఆరంభంలో ఎగువన కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ఆ నదులపై ఉన్న ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరింది. ఇప్పుడు కాస్త వర్షాలు తగ్గడంతో వరద నిలిచిపోయింది.

శ్రీశైలం ప్రాజెక్టుకు శనివారం వరకు 4వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చింది. అయితే ఆదివారానికి పూర్తిగా వరద నీరు నిలిచిపోయింది. ఇక ఎగువ నుంచి వరద ఆగిపోవడంతో దిగువకు నీటి విడుదలను నిలిపివేశారు అధికారులు.

ప్రాజెక్ట్ నీటిమట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 818.70 అడుగుల చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీ గాను, 39.9087 టీఎంసీలు ఉంది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతం జరగడం లేదు.