Confusion Of Corona Cases In Anantapur Ggh
Anantapur GGH : అనంతపురం జీజీహెచ్‌లో కరోనా కేసుల గందరగోళం నెలకొంది. జిల్లాలో మహమ్మారి కలకలం సృష్టిస్తుండగా.. ఒక్క అనంతపురం ప్రభుత్వాసుపత్రిలోనే రెండు రోజుల్లో 26 మంది కరోనా బాధితులు మృతి చెందినట్లు తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే 12 మంది కరోనా పేషెంట్ల మృత్యువాత పడగా.. మొన్న 14 మంది వైరస్ బాధితులు చనిపోయారని సమాచారం.
అయితే.. అధికారిక లెక్కలు, రికార్డుల్లో మాత్రం మరణాలు, కేసుల వివరాల్లో తేడా కనిపిస్తోంది. జిల్లాలో కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఆక్సిజన్ సిలెండర్లు, బెడ్స్ లేక కరోనా పేషెంట్ల అవస్థలు పడుతున్నారు.
అనంతపురం జీజీహెచ్‌లో బెడ్స్ దొరక్క.. ఆంబులెన్సుల్లోనే పేషెంట్లు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జీజీహెచ్‌కు కర్ణాటక నుంచి కరోనా పేషెంట్లు రోగులు వస్తుండటంతో.. బెడ్స్, ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది.