Gidugu Rudra Raju : జగన్ నడుపుతున్నది నకిలీ కాంగ్రెస్.. వైసీపీలో బానిసలుగా ఉన్నవారంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలి : గిడుగు రుద్రరాజు

కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉందన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, మూడు రాజధానులు ఎలా వస్తాయని నిలదీశారు. అమరావతే రాజధానిగా ఉండాలని చేస్తోన్న పోరాటానికి మద్దతు తెలిపేందుకు ప్రియాంక గాంధీ స్వయంగా వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

Gidugu Rudraraju

Gidugu Rudraraju Criticized Jagan : జగన్ నడుపుతున్నది నకిలీ కాంగ్రెస్ ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు విమర్శించారు. వైసీపీలో జగన్ కు బానిసలుగా ఉన్నవారంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ 175 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని తెలిపారు. ఏపీలో లీడింగ్ లో ఉన్న పార్టీలు బీజేపీకి దగ్గరయ్యేందుకు ఉబలాటపడుతు‌న్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.

ఆయా పార్టీలు తమ రాజకీయ ఎజెండా ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల సీఎం జగన్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వ వ్యవస్ధలతో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలకు ఒక న్యాయం, బీజేపీకి అంటగాకే పార్టీలకు మరో న్యాయమా అని నిలదీశారు. కాంగ్రెస్ భావజాలాన్ని నచ్చే వారంతా పార్టీలోకి రావచ్చన్నారు. అదే క్రమంలో షర్మిళ కూడా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.

AP High Court : ఏపీ హైకోర్టు తరలింపు ప్రతిపాదనేదీ పెండింగ్ లో లేదు : కేంద్ర న్యాయశాఖ

కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉందన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, మూడు రాజధానులు ఎలా వస్తాయని నిలదీశారు. అమరావతే రాజధానిగా ఉండాలని చేస్తోన్న పోరాటానికి మద్దతు తెలిపేందుకు ప్రియాంక గాంధీ స్వయంగా వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామని రాహుల్ గాంధీ ప్రకటించారని వెల్లడించారు.

891 రోజులుగా జరుగుతోన్న పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. శనివారం జింక్ గేట్ నుంచి దీక్షా శిబిరం వరకు ర్యాలీ నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. మధ్యాహ్నం యూనియన్ లీడర్లతో సమావేశమవుతామని తెలిపారు. అనతరం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ విశాఖ పర్యటన తేదీలను ఖరారు చేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ ఆగస్టులో వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు