Veena Vani SBI Exam Issue: వీణా-వాణీలకు మళ్లీ కొత్త చిక్కులు.. వేర్వేరు గదుల్లో SBI PO సీట్లు.. పరీక్ష ఎలా రాయాలో?
అవిభక్త కవలలు వీణా-వాణీల(Veena Vani SBI Exam Issue)కు కొత్త సమస్య వచ్చి పడింది.
- V Santhosh Kumar
- Published on- July 23, 2026 / 09:17 PM IST
Conjoined twins veena vani sbi po exam separate room allotment issue
- వీణావాణీలకు ఎస్‌బీఐ ఎగ్జామ్
- వేర్వేరు గదుల్లో సీట్ల కేటాయింపు
- ఒకేగది ఇవ్వాలని విజ్ఞప్తి
Veena Vani SBI Exam Issue: అంగవైకల్యం అడ్డంకులను అధిగమిస్తూ చదువులో రాణిస్తున్న అవిభక్త కవలలు వీణా-వాణీలకు మళ్లీ ఒక కొత్త సమస్య వచ్చిపడింది. ఇటీవలే బీకామ్ ను డిస్టింక్షన్‌లో పూర్తి చేసిన వీరిద్దరూ.. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆగస్టు 1న జరగనున్న ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు వచ్చాక వారికి పెద్ద సవాలు ఎదురైంది.
China AI Face Buying: ఇక మీ ముఖాన్ని అమ్ముకోవచ్చు.. 3D స్కాన్‌తో రూ.6 వేలకే.. చైనాలో వింత ట్రెండ్
వేర్వేరు గదుల్లో సీట్లు.. అసలు పరీక్ష ఎలా రాయాలి?
అధికారులు వీరిద్దరికీ ఒకే పరీక్షా కేంద్రాన్ని కేటాయించినప్పటికీ, భిన్నమైన గదులను కేటాయించారు. తలలు అతుక్కుని ఉండే వీణా-వాణీలు ఒకే దగ్గర కూర్చోకుండా వేర్వేరు గదుల్లో పరీక్ష రాయడం ఆచరణలో అసాధ్యం. గతంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షలన్నింటినీ శిశు విహార్‌లోనే ప్రత్యేక ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో రాసిన విషయాన్ని వీరి అధ్యాపకులు గుర్తుచేస్తున్నారు.
మానవత్వంతో స్పందించాలని విజ్ఞప్తి:
2003లో జన్మించిన వీణా-వాణీలను(Veena Vani SBI Exam Issue) విడదీసేందుకు విదేశీ వైద్యులు సైతం ప్రయత్నించినా శస్త్రచికిత్స కుదరలేదు. నిలోఫర్ ఆస్పత్రి, శిశు విహార్‌లలో పెరుగుతూనే వీరు చదువుల్లో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రయాణ భారాన్ని, శారీరక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అమీర్‌పేట్ శిశు విహార్‌కి సమీపంలోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయించాలని.. అలాగే ఒకే గదిలో పరీక్ష రాసేలా ఎస్‌బీఐ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
