ఈ చెట్టు ఎందుకంత డేంజర్? మనిషికి చేసే హాని ఏంటి? పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి..

ఏపీలో విరివిగా ఉన్న ఆ చెట్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది?

Conocarpus Plants : చెట్లు ప్రగతికి మెట్లు అని చదువుకున్నాం. ఆక్సిజన్ ప్రసాదించే మహా ప్రసాదాలు అని కొనియాడాం. కానీ, ఓ చెట్టు మానవుల మనుగడకే ఎసరు పెట్టేలా ఉంది. ఇంతకీ పక్షులు కూడా వాడని ఆ చెట్టు ఏంటి? ఆ చెట్టు ఎందుకంత డేంజరస్? ఏపీలో విరివిగా ఉన్న ఆ చెట్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది?

పర్యావరణానికి హాని చేసే చెట్లు కూడా ఉన్నాయని కోనోకార్పస్ చెట్లు రుజువు చేశాయి. వీటిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఈ చెట్లు చేసే చేటు చూసి నిర్ధాంతపోయారు. వాటిని పెంచితే పర్యావరణం నాశనం అవుతుందని హెచ్చరించారు. పక్షులు కూడా వాలని ఈ చెట్లను పలు ప్రపంచ దేశాలు నిషేధించాయి. అయితే, ఏపీలో ఈ చెట్లు విరివిగా ఉన్నాయి. రోడ్లపై అందంగా ఉండాలనే ఉద్దేశంతో డివైడర్లు, ఫుట్ పాత్ లపైన ఈ చెట్లను నాటారు. ఏ ప్రభుత్వ ఆఫీసుకి వెళ్లినా, ఏ గవర్నంట్ ఆసుపత్రికి వెళ్లినా ఈ చెట్లు గుంపులుగా దర్శనమిస్తున్నాయి.

మనుషులకు హాని చేస్తూ, భూగర్భ జలాలకు ముప్పు కలిగించే ఈ చెట్ల పెంపకంపైన ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆ చెట్ల వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.

డేంజరస్ ట్రీ.. కోకోకార్పస్ చెట్టు చేసే చేటు..
* పక్షులు వాలని ప్రాణాంతక చెట్టు
* చర్మ, శ్వాసకోశ వ్యాధులు వస్తాయంటున్న వైద్యులు
* పర్యావరణ పరిరక్షణకు విఘాతమని సైంటిస్టుల హెచ్చరిక
* ఏపీలో రహదారుల వెంబడి, పార్కులు, ప్రభుత్వ ఆఫీసుల ఆవరణలో పెంపకం
* కోనో కార్పస్ చెట్లను నిషేధించిన పలు ప్రపంచ దేశాలు
* కోనో కార్పస్ చెట్ల పెంపకంపై ప్రపంచం ఆందోళన
* దశలవారీగా కోనో కార్పస్ చెట్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశం

కోనో కార్పస్ మొక్క ఏపుగా పెరుగుతుంది. కోన్ ఆకారంలో పెరుగుతుంది. సౌత్ అమెరికా సంబంధించిన మొక్క. ఎడారి ప్ర్రాంతాల్లో ఇసుక తుపానును ఎదుర్కొనేందుకు అడ్డుగా ఉంటుందని, అలాగే వాతావరణంలో వేడిని తగ్గిస్తుందని, అలాగే పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈ కోనో కార్పస్ మొక్కలను మన దేశంతో పాటు అనేక దేశాల్లో నర్సరీలలో పెంచారు. అనేక ప్రభుత్వ ఆఫీసుల ఆవరణలో ఈ మొక్కలు పెంచారు. అయితే, ఇది అత్యంత ప్రమాదకారి మొక్క అని తెలియడంతో ఇప్పుడు దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేక దేశాలు ఈ చెట్ల పెంపకాన్ని పూర్తిగా బ్యాన్ చేశాయి. ఇప్పుడు మన దేశంలోనూ ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు(తెలంగాణ, ఇతర రాష్ట్రాలు)… ఈ చెట్లను బ్యాన్ చేసిన పరిస్థితి ఉంది. వీటిని కచ్చితంగా తొలగించాల్సిన పరిస్థితి ఉంది. ఈ చెట్ల కారణంగా పర్యావరణం దెబ్బతింటుంది. దాంతో పాటు మనుషులు వ్యాధుల బారిన పడతారు.

కోనో కార్పస్ చెట్ల వల్ల పర్యావరణం సమతుల్యత దెబ్బ తింటుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మొక్కలు అటవీ ప్రాంతాల్లో పెరిగితే గడ్డి జాతి మొక్కలు పెరగవని, తద్వారా వన్య ప్రాణులకు ఆహారం దొరకదని చెబుతున్నారు.

కోనో కార్పస్ చెట్ల వల్ల మనుషులకు హాని కలుగుతుందని ఎందరో సైంటిస్టులు తేల్చి చెప్పారు. చర్మ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని ఇటు డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు.

జీవ కోటికి ప్రాణహాని తలపెట్టే కోనోకార్పస్ చెట్లను దశలవారిగా తొలగించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి విడతగా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏపుగా పెరిగిన కోనోకార్పస్ చెట్లను తొలగిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం అప్రమత్తమై డేంజరస్ చెట్లను తొలగించడాన్ని పర్యావరణ ప్రేమికులు స్వాగతిస్తున్నారు.

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు