Perni Nani : జగన్‌ను అరెస్ట్ చేసేందుకు కుట్ర- మాజీ మంత్రి పేర్నినాని సంచలన ఆరోపణలు

జగన్ కు కానీ, వైసీపీకి కానీ జరిగే నష్టం ఏమీ లేదు. జంకేది లేదు, బొంకేది లేదు..

Perni Nani : కూటమి సర్కార్ పై వైసీపీ నేతలు, మాజీ మంత్రులు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అరెస్ట్ కు కుట్ర జరుగుతోందని, కావాలనే కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. అరెస్ట్ అయిన వారితో జగన్ పై తప్పుడు వాంగూల్మం ఇప్పిస్తున్నారని మాజీమంత్రి పేర్నినాని అన్నారు. వైసీపీ నేతలపై అమర్యాదపూర్వకంగా స్క్రిప్ట్ చేసి టీడీపీ నేతలు శునకానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు మరో మాజీమంత్రి బొత్స సత్యనారాయణ. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుందన్నారాయన.

Also Read : ఏపీలో ఉగాది నుంచి కొత్త పథకం.. ఏంటీ P4, ఎవరికి ప్రయోజనం, లక్ష్యం ఏంటి..

”జగన్ ను ఏదో రకంగా తప్పుడు వాంగ్మూలాలతో, తప్పుడు వార్తలతో గాలి పోగేసి ప్రచారం చేసి టీవీలు, పేపర్లు, పార్లమెంటులో, అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన జగన్ కు కానీ, వైసీపీకి కానీ జరిగే నష్టం ఏమీ లేదు. జంకేది లేదు, బొంకేది లేదు” అని పేర్నినాని తేల్చి చెప్పారు.