ఏపీలో కరోనా : 12 గంటలు..14 కొత్త కేసులు..

  • Publish Date - April 6, 2020 / 10:41 AM IST

ఏపీలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 12 గంటల్లో 14 కొత్త కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో కరోనా కేసులు 266కు పెరిగాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా  56 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు.

ఇక  నెల్లూరులో 34, గుంటూరు జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 28, ప్రకాశంలో 23, కడపలో 23, విశాఖలో 20, చిత్తూరులో 17, పశ్చిమ గోదావరిలో 16, తూర్పుగోదావరిలో 11, అనంతపురం జిల్లాలో 6 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం కేసులు నమోదు కాకపోవడం ఊరటనిస్తోంది. 

కర్నూలు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 56కు చేరడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో రెండు రోజులపాటు నిత్యావసరాలను సైతం నిలిపివేయనున్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించిన నేపథ్యంలో ఆయా చోట్ల ఎవర్నీ బయటకు రానీయకుండా నిర్బంధించారు. 

 రాష్ట్రంలో నమోదైన 252 కేసుల్లో 229 కేసులు ఢిల్లీ మూలాలు ఉన్నవారివే. అయితే కరోనా కేసులు బయటపడుతున్న ప్రాంతాలపై రాష్ట్ర వైద్య శాఖ ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఆయా ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించి అక్కడ రాకపోకలను పూర్తిగా నిషేధించడమే కాకుండా, శానిటైజేషన్, బ్లీచింగ్‌ వంటి కార్యక్రమలను పెద్దఎత్తున చేపడుతోంది. 

Also Read | సైబర్ నేరగాళ్లు : బగ్గా వైన్స్ పేరిట మోసం..రూ. 51 వేలు పొగొట్టుకున్న వ్యక్తి