ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన కరోనా కేసులు.. మరణాలు

  • Publish Date - November 18, 2020 / 07:19 PM IST

రోజుకు పది వేల కేసులు నమోదయిన పరిస్థితి నుంచి వెయ్యి కేసులు మాత్రమే నమోదయ్యే పరిస్థితిలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాం. దేశవ్యాప్తంగా రాష్ట్రం గురించి ఆందోళన కలిగేలా వచ్చిన కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,618 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,236 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,57,395కి చేరింది.



అయితే కరోనా మరణాలు కూడా బుధవారం స్వల్పంగా తగ్గాయి. బుధవారం కరోనా మహమ్మారి కారణంగా 9 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు, తూర్పు గోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,899కు చేరుకుంది.



అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు కూడా భారీగా పెరిగాయి. బుధవారం 1,696 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,33,980 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 16వేల 516 యాక్టివ్‌ కేసులు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి 93,33,703 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.