AP Covid – 19 : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మెల్లిమెల్లిగా తోక ముడుస్తున్నట్లే కనిపిస్తోంది. గతంలో 20 వేలు, 10 వేలు పాజిటివ్ కేసులు నమోదవగా..ఇప్పుడు ఈ సంఖ్య 4 నుంచి 5 వేలకు చేరుకుంది. తాజాగా..24 గంటల్లో 4 వేల 872 కరోనా కేసులు నమోదయ్యాయి. 86 మంది చనిపోయారు.

AP New Corona Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మెల్లిమెల్లిగా తోక ముడుస్తున్నట్లే కనిపిస్తోంది. గతంలో 20 వేలు, 10 వేలు పాజిటివ్ కేసులు నమోదవగా..ఇప్పుడు ఈ సంఖ్య 4 నుంచి 5 వేలకు చేరుకుంది. తాజాగా..24 గంటల్లో 4 వేల 872 కరోనా కేసులు నమోదయ్యాయి. 86 మంది చనిపోయారు. ఏపీలో ప్రస్తుతం 1, 14, 510 యాక్టివ్ కేసులున్నాయి. 11 వేల 552 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 13 మంది, గుంటూరు జిల్లాలో 10 మంది కరోనాతో చనిపోయారు. అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలో 9 మంది చొప్పున మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :- 

కోవిడ్ వల్ల చిత్తూరులో 13 మంది, గుంటూరులో పది మంది, అనంతపూర్ లో 9 మంది, శ్రీకాకుళంలో 9 మంది, విజయనగరంలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖలో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, నెల్లూరులో నలుగురు మరణించారు.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు :
అనంతపూర్ 535. చిత్తూరులో 961. ఈస్ట్ గోదావరిలో 810. గుంటూరులో 374. వైఎస్ఆర్ కడపలో 404. కృష్ణాలో 175. కర్నూలులో 212. ప్రకాశంలో 447. శ్రీకాకుళంలో 166. విశాఖపట్ణణంలో 189. విజయనగరంలో 207. వెస్ట్ గోదావరిలో 160. మొత్తం కేసులు 4872.

రాష్ట్రంలోని నమోదైన మొత్తం 17,60,316 పాజిటివ్ కేసు లకు గాను 16,34,254 మంది డిశ్చార్జ్ కాగా 11,552 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,14,510.

Read More : PM Modi కరోనాపై భారత్ పోరాటం – మోడీ

ట్రెండింగ్ వార్తలు