ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 765 కేసులు నమోదయ్యాయి. మరో 12మంది కరోనాతో చనిపోయారు. ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఆ రెండు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. తాజాగా నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందినవి 727. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 32మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 6 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17వేల 699కి చేరగా, మరణాల సంఖ్య 218కి పెరిగింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9వేల 473. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,008.
24 గంటల్లో 24వేల 926 కరోనా టెస్టులు:
గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 24వేల 962 శాంపుల్స్ పరీక్షించగా 765 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఏపీలో 9లక్షల 96వేల 573 కరోనా టెస్టులు చేశారు. ఏపీని కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొన్ని రోజులుగా 500కు పైగా కేసులు రికార్డ్ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Read:పథకం ప్రకారమే వైసీపీ నేత భాస్కరరావు హత్య, కొల్లు రవీంద్ర సూత్రధారి, ఎస్పీ రవీంద్రనాథ్