Andhra pradesh
Andhra Pradesh : ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,323 మంది నమూనాలు పరీక్షించగా 1,245 కొత్త కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,450 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు.
Read More : Tata : అమెజాన్ కాసుకో.. రంగంలోకి మరో ఇండియన్ బిజినెస్ టైకూన్
ప్రస్తుతం 13,535 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ వల్ల చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
Read More : Prema Nagar : చరిత్ర సృష్టించిన ప్రేమకథకు 50 ఏళ్లు..
ఇక జిల్లాల వారిగా నమోదైన కేసులను ఒకసారి పరిశీలిస్తే..
అనంతపురం – 13, చిత్తూరు – 207, తూర్పుగోదావరి – 167, గుంటూరు – 117, కడప – 93, కృష్ణా – 138, కర్నూలు – 13, నెల్లూరు – 158,ప్రకాశం – 128, శ్రీకాకుళం – 14, విశాఖపట్నం – 62, విజయనగరం – 13, పశ్చిమ గోదావరి – 123