Prema Nagar : చరిత్ర సృష్టించిన ప్రేమకథకు 50 ఏళ్లు..

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ నటించిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమ నగర్’ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది..

Prema Nagar : చరిత్ర సృష్టించిన ప్రేమకథకు 50 ఏళ్లు..

Prema Nagar 50

Prema Nagar: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా.. కె.ఎస్. ప్రకాశ రావు (కె.రాఘవేంద్ర రావు తండ్రి) దర్శకత్వంలో.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మూవీ మెఘల్ డి.రామానాయుడు నిర్మించిన సెన్సేషనల్ అండ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమనగర్’.. 1971 సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం 2021 సెప్టెంబర్ 24 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.

Love Story Review : ‘లవ్ స్టోరీ’ రివ్యూ..

రచయిత్రి కోడూరి కౌసల్యా దేవి నవల ఆధారంగా ‘ప్రేమ నగర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. జమీందారు కొడుకు కళ్యాణ్ వర్మ (ఏఎన్నార్) విలాసవంతమైన జీవితానికి, దురలవాట్లకు బానిసగా మారతాడు. ఎయిర్ హోస్టెస్‌గా పరిచయమైన లత (వాణిశ్రీ) కళ్యాణ్ దగ్గర సెక్రటరీగా ఉద్యోగంలో చేరుతుంది. మెల్లగా అతణ్ణి మంచి వాడిగా మారుస్తుంది. దీంతో లతపైన ప్రేమ పుట్టి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అందుకు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా కళ్యాణ్‌కు లత దూరమవడం.. ఆమెను వెతుక్కుంటూ సరిగ్గా పెళ్లి సమయానికి కళ్యాణ్ వెళ్లడం.. ఇక లత ఎప్పటికీ తనది కాదనుకుని ఆత్మహత్య ప్రయత్నం చెయ్యడం.. లత వచ్చి హాస్పిటల్‌లో చేర్పించండం.. చివరికి ఇద్దరూ ఒక్కటవడం.. ఇదీ క్లుప్తంగా ‘ప్రేమ నగర్’ కథ..

Anr Vanisri

 

ఏఎన్నార్ పర్ఫార్మెన్స్ సినిమాకి మెయిన్ హైలెట్.. తాగుబోతుగానూ, ప్రేమ విఫలమైన తర్వాత బాధను ఆయన వ్యక్త పరిచినం విధానానికి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. వాణిశ్రీ నటన మహిళా ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక కె.వి.మహదేవన్ సంగీతం సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. ‘ప్రేమ నగర్’ పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్..

ANR Jayanthi : ఏఎన్నార్ లివ్స్ ఆన్.. నాగార్జున ఎమోషనల్ వీడియో..

‘‘నేను పుట్టాను..
లే లే లే నా రాజా..
ఉంటే ఈ ఊళ్ళో ఉండు..
ఎవరో రావాలి..
తేట తేట తెలుగులా..
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్లా..
నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం..
మనసు గతి ఇంతే..
ఎవరి కోసం..ఎవరి కోసం’’.. ఈ పాటలు, వాటిలో నటీనటుల అభినయం అద్భుతం.

Vasantha Maligai

 

అంతకుముందు నిర్మాతగా నష్టాల్లో ఉన్న రామానాయుడిని అగ్రనిర్మాతగా నిలబెట్టింది ‘ప్రేమ నగర్’.. బాక్సాఫీస్ బరిలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి అదే ఏడాది అక్కినేని నటించిన సెన్సేషనల్ ఫిలిం ‘దసరా బుల్లోడు’ తర్వాత హయ్యస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. ‘ప్రేమ నగర్’ ను హిందీలో రాజేష్ ఖన్నా – హేమ మాలినిలతో ‘ప్రేమ్ నగర్’, తమిళ్‌లో శివాజీ గణేషన్ – వాణిశ్రీలతో ‘వసంత మాలిగల్’ పేరుతో కె.ఎస్. ప్రకాశ రావు దర్శకత్వంలోనే పున:నిర్మించారు రామానాయుడు. తెలుగు సినిమా చరిత్రలో ప్రేమకథా చిత్రాలలో ‘ప్రేమ నగర్’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం..

Prem Nagar