Corona Impact: ఏపీ, తెలంగాణల మధ్య రైళ్లు రద్దు!

Trains Cancelled: తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు షాకిచ్చింది దక్షిణ మధ్య రైల్వే. తెలుగు రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తిరిగే పలు రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రైల్వేశాఖ.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కర్ఫ్యూ కారణంగా బస్సుల రాకపోకలు ఆగిపోగా.. ప్రయాణికులెవ్వరూ రాకపోకలకు ఆసక్తి చూపట్లేదు. దీంతో రైళ్లు తిరగడం భారంగా మారుతుంది. అతి తక్కువ ఆక్యుపెన్సీ దృష్ట్యా ఏపీ, తెలంగాణ మధ్య పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

పలు ప్రాంతాల మధ్య నడిచే 28 ప్రత్యేక రైళ్లను రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 30 రైళ్లు సైతం రైల్వేశాఖ రద్దు చేసినట్లు ప్రకటించింది. శతాబ్ది, జనశతాబ్ది, దురంతో, రాజధాని రైళ్లు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు