Corona Restrictions Are Disregarded In East Godavari District
Corona restrictions are disregarded : ఓ వైపు కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా… ప్రజల్లో మాత్రం ఏ మాత్రం చలనం లేకుండా పోయింది. వైరస్ వ్యాప్తి చెందకుండా… జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ… ప్రజలు మాత్రం కనీసం పట్టించుకోవటం లేదు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో నిర్వహిస్తున్న ఎడ్ల బండి పోటీల్లో ఏ ఒక్కరు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. అటు నిర్వాహకులు కూడా పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు.
ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో మొదలైన రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలను వీక్షించడానికి వేలాదిగా జనం తరలివచ్చారు. అయితే వారిలో ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. కనీసం మాస్కులు కూడా ధరించలేదు. అటు పోలీసులు హెచ్చరికలు చేసినప్పటికీ… నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోకుండా పోటీలు నిర్వహిస్తున్నారు.