Telugu States
Containment Zones In GHMC : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తోంది. రోజూ 5వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నైట్ కర్ఫ్యూ అమలువుతున్నా..వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ కోవిడ్ పేషెంట్స్‌తో నిండిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 43వేల599 బెడ్లు అందుబాటుల్లో ఉన్నాయి. వాటిలో 16,809 నిండిపోయాయి. వెంటిలేటర్‌పై 4వేల 789 మంది చికిత్స పొందుతుండగా, 8వేల 157 మందికి ఆక్సిజన్ అందిస్తున్నారు.
33 కరోనా సెంటర్లు : –
రాష్ట్రంలో 33 కరోనా కేర్ సెంటర్లు ఉన్నాయి. గాంధీ ఆస్పత్రిలో వెయ్యీ 890 బెడ్స్ నిండిపోయాయి. వెంటిలేటర్ బెడ్స్ 650 నిండిపోయాయి. ఆక్సిజన్ బెడ్స్ వెయ్యి నిండిపోయాయి. వెయ్యీ 261 బెడ్స్ సామర్థ్యం ఉన్న టిమ్స్ కూడా నిండిపోయింది. టిమ్స్‌లో 567 మంది చికిత్స పొందుతున్నారు. వంద ఐసీయూ బెడ్‌లు నిండిపోయాయి. ఉమ్మడి వరంగలో జిల్లాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
జీహెచ్ఎంసీలో కంటైన్మెంట్ జోన్లు : –
జీహెచ్‌ఎంసీ పరిధిలో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఆరు జోన్లలో 63 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్ జోన్‌లో 10, చార్మినర్ జోన్‌లో 12, ఖైరతాబాద్ జోన్‌లో 10, శేరిలింగంపల్లి జోన్‌లో 10, కూకట్‌పల్లి జోన్‌లో 10, సికింద్రాబాద్ జోన్‌లో 11 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తూ GHMC ఆదేశాలు ఇచ్చింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలో కరోనా : –
కరోనా సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్‌ను అతలాలకుతలం చేస్తోంది. ఊహించని రీతిలో వైరస్ విస్తరిస్తోంది. రోజుకు దాదాపు 10వేల కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రతి జిల్లాలోనూ రోజుకు వందకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా బారిన పడి అత్యవసరచికిత్స కోసం వస్తున్న వారు ఎక్కువవడంతో ఆస్పత్తులన్నీ కిటకిడలాడుతున్నాయి. కరోనా రోగుల కోసం ప్రత్యేక ఆస్పత్రులూ ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్‌లో శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువగా ఉండడంతో…రోగులకు ఆక్సిజన్ అందించాల్సిన అవసరం అంతకంతకూ పెరుగుతోంది. అనేక ఆస్పత్రుల్లో ఐసీయూ పడకల సంఖ్య, ఆక్సిజన్ సదుపాయం ఉన్న బెడ్ల సంఖ్య పెంచి…రోగులకు చికిత్స అందించే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.
గుంటూరు జిల్లాపై : –
కరోనా తొలివేవ్ గుంటూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రంలో అత్యధిక కేసులు ఈ జిల్లాలోనే నమోదయ్యాయి. రెండో వేవ్‌లోనూ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గుంటూరు జిల్లాలో కరోనా చికిత్సకు మొత్తం 49 ఆస్పత్రులు కేటాయించారు. ఈ ఆస్పత్రులన్నింటిలో కలిపి 301 ఐసీయూ బెడ్స్ అందుఆబటులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 81 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇంకా 220 పడకలు ఖాళీ ఉన్నాయి. 49 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకలు వెయ్యీ 79 ఉండగా, 378 పడకలు నిండిపోయాయి. 701 బెడ్స్ ఇంకా ఖాళీ ఉన్నాయి.
విశాఖ జిల్లాపై : –
విశాఖ పట్టణంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగానే ఉంది. రోజుకు 500 నుంచి వెయ్యి మధ్య కేసులు నమోదవుతున్నాయి. 5వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం కరోనా ఆస్పత్రులు ఏడు ఉన్నాయి. అందులో 937 ఆక్సిజన్ సదుపాయం ఉన్న బెడ్స్ ఏర్పాటు చేశారు. ఐసీయూ పడకలు 204 ఉన్నాయి. వాటిలో 133 బెడ్స్‌లో కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. 71 ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్స్‌లో 305 నిండిపోగా, 632 పడకలు అందుబాటులో ఉన్నాయి. విశాఖలో రోజుకు 40 నుంచి 50 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా అంతకంటే రెట్టింపు నిల్వలు ఉన్నాయి. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదు. జిల్లా వ్యాప్తంగా 1,200 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుఉతున్నారు.
విజయనగరంలో : –
కరోనా తొలి వేవ్ విజయనగరంలో అంత ప్రభావం చూపలేదు కానీ రెండో వేవ్‌లో రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. విజయనగరంలో ప్రస్తుతం 2వేల105 యాక్టివ్ కేసులున్నాయి. రోజూ 3,500 నుంచి 4వేల టెస్టులు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 8 కోవిడ్ ఆస్పత్రుల్లో 125 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశారు. వాటిలో 62 బెడ్స్ నిండిపోయాయి. 63 ఖాళీలున్నాయి. ఇక జిల్లాలో ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకలు 310 ఉండగా వాటిలో 112 మంది చికిత్స పొందుతున్నారు. 198 పడకలు ఖాళీ ఉన్నాయి. రేపటినుంచి మరో నాలుగు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందించాలని నిర్ణయించారు. వీటికి తోడు అదనంగా 31 ఆస్పత్రుల్లో 1,800 బెడ్స్ ఏర్పాటు చేసి కరోనా వైద్యం అందించనున్నారు.
సిక్కోలులో కరోనా సెకండ్ వేవ్ : –
కరోనా తొలివేవ్‌లో వైరస్ ప్రభావం ఏ మాత్రం కనిపించని జిల్లా శ్రీకాకుళం. రాష్ట్రమంతా, దేశమంతా కరోనా విజృంభిస్తోన్నా శ్రీకాకుళం మాత్రం సేఫ్‌గా ఉంది. చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కానీ రెండో వేవ్ వచ్చేసరికి సిక్కోలు పరిస్థితి తారుమారయింది. కరోనా ప్రభావంతో శ్రీకాకుళం అల్లాడుతోంది. అన్ని జిల్లాల్లో కన్నా అత్యధికంగా శ్రీకాకుళంలోనే రోజువారీ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. రోజూ దాదాపు 1500 కేసులతో శ్రీకాకుళం కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న జిల్లాగా మారిపోయింది. యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేలు దాటింది. జిల్లాలో మూడు కరోనా ఆస్పత్రులు ఉన్నాయి. 166 ఐసీయూ బెడ్స్‌లో 82 ఇప్పటికే నిండిపోయాయి. మరో 84 మాత్రమే ఖాళీ ఉన్నాయి. 663 ఆక్సిజన్ బెడ్లు ఉండగా 180 పడకల్లో కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. 483 ఖాళీలున్నాయి.
అనంతపురంలో : –
అనంతపురంలో 849 కేసులు నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. మొత్తం 8 కరోనా ఆస్పతరుల్లో 145 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. వాటిలో 22 నిండిపోయాయి. 123 అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ పడకల్లో 684 అందుబాటులో ఉండగా 319 నిండిపోయాయి. 365 ఖాళీలున్నాయి.
కృష్ణా జిల్లాలో : –
కృష్ణా జిల్లాలో కరోనా వ్యాప్తి గతంలో పోలిస్తే కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కృష్ణా జిల్లాలో దాదాపు 300 కేసులు కొత్తవి నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3వేలు దాటింది. జిల్లాలో మొత్తం 20 కరోనా ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. 271 ఐసీయూ బెడ్స్‌లో 159 నిండిపోయాయి. 112 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. 823 ఆక్సిజన్ పడకల్లో 561 నిండిపోగా, 262 ఖాళీలున్నాయి.
చిత్తూరులో : –
చిత్తూరులో వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరులో 24 ఆస్పత్రుల్లో 422 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. వాటిలో 158 నిండిపోయాయి. 264 ఖాళీలున్నాయి. చిత్తూరు జిల్లాలో కరోనా రోగుల చికిత్సకు అన్ని ఏర్పాట్లూ చేశామని కలెక్టర్ చెప్పారు.
Read More : కేంద్రం వివక్ష చూపుతుంది: ఆక్సిజన్, వ్యాక్సిన్ ఇవ్వడం లేదు