Corona Second Wave Ttd Takes Key Decision On Darshans
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తూ ఉంది. కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే.. తిరుమలలోని కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం.
ఏప్రిల్ 12వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్లు నిలిపివేయాలని నిర్ణయించి ప్రకటన చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి సర్వదర్శనం టిక్కెట్లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ. అప్పటివరకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కొనసాగుతాయని టీటీడీ స్పష్టం చేసింది.