కరోనా వైరస్ లాంటివి వ్యాప్తి చేస్తే..ఇక వారు చిప్పకూడు తినాల్సి వస్తుంది. అంటే అర్థమైందా…అదే జైలు శిక్ష పడుతుందన్నమాట. మనుషు ప్రాణాకు ముప్పు కలిగించే వ్యాధులు, వైరస్ ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జైలు శిక్షతో పాటు భారీ జరిమాన విధించనుంది. IPC సెక్షన్ 270 ప్రకారం కేసులు నమోదు చేస్తారు. నిందితుపై చర్యలు తీసుకోనున్నారు.
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారీ…తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. పలు కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. వైరస్ సోకిన వారిని ప్రత్యేకంగా చికిత్స లు చేస్తున్నారు. క్వారంటైన్ విధిస్తున్నారు. కానీ కొంతమంది క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.
క్వారంటైన్ నిబంధను ఉల్లంఘించిన బయటకు వచ్చిన వారికి సెక్షన్ 271 ప్రకారం కేసులు నమోదు చేస్తారు. ఆరు నెలల పాటు శిక్షలు వేస్తారు. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాపించకుండా…రాష్ట్ర ప్రభుత్వం 2020, మార్చి 31వ తేదీ వరకు లాకౌట్ ప్రకటించింది. ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే…మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
* క్వారంటైన్ నిబంధను ఉల్లంఘిస్తే (ఐపీసీ సెక్షన్ 271) : ఆరు నెలల వరకు జైలు శిక్ష, జరిమాన
* ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం (ఐపీసీ సెక్షన్ 188) : నెల రోజుల వరకు జైలు శిక్ష.
* ప్రాణాలకు ముప్పు కలిగించే వైరస్, ఇన్ ఫెక్షన్లు నిర్లక్ష్యంగా వ్యాప్తి చేస్తే (ఐపీసీ సెక్షన్ 269) : ఆరు నెలల వరకు జైలు శిక్ష. జరిమాన లేకపోతే..రెండూ.
* మనుషు ప్రాణాలకు కలిగించే వ్యాధులకు సంబంధించిన వైరస్ లు దురుద్దేశ్యపూర్వకంగా వ్యాప్తి చేస్తే (ఐపీఎస్ సెక్షన్ 270) : రెండేళ్ల వరకు జైలు శిక్ష జరిమాన.
Read More : ఢిల్లీలో షాకింగ్ ఘటన : కరోనా అంటూ యువతిపై ఉమ్మేశాడు