ఏపీ ప్రజలకు శుభవార్త : త్వరలో తగ్గనున్న కరోనా

  • Publish Date - August 11, 2020 / 08:20 PM IST

కరోనాతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయని కోవిడ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. త్వరలో వైరస్ తగ్గుతుందని చెబుతున్నారు. కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆగస్టు 21 నుంచి.. గుంటూరు, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సెప్టెంబర్ 4 నుంచి కరోనా తగ్గబోతుందన్నారు.

సెప్టెంబర్ మొదటివారంలో కడప, ప్రకాశం వైరస్ తగ్గనుంది. ఇక ఆగస్టు 20 తర్వాత కరోనా మరణాల శాతం కూడా తగ్గే అవకాశముందని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. మరణాల సంఖ్య రోజుకు 50 కంటే తగ్గనున్నాయి. రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే చాలు మంచికాలం ముందుందని అంటున్నారు. ఆస్పత్రులు స్వీయ నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు.

ప్రతి రోజు 50 వేలకుపైగా టెస్టులు చేస్తున్నామని తెలిపారు. పది వేల వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 25 లక్షల టెస్టులు చేశామని పేర్కొన్నారు. టెస్టులు చేస్తున్నందు వల్ల కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఆందోళన పడుతన్నామని.. కానీ ఇది భవిష్యత్ లో తగ్గబోతుందన్నారు. టెస్టులు అత్యధికంగా చేస్తున్నామని తెలిపారు.

మరణాల సంఖ్య తక్కువగా ఉందని.. మరణాలు 2 లేదా 3 శాతం ఉంటే కంట్రోలో చేయలేమన్నారు. 0.9 శాతమే మరణాల సంఖ్య ఉందన్నారు. ఇది 0.5 నుంచి 0.4 శాతానికి తగ్గిపోతుందన్నారు. 10 వేలు వచ్చే కేసులు..7500 వచ్చాయని తెలిపారు. తగ్గుకుంటూ పోతుందని.. ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.