ఏపీలో కరోనా : కృష్ణాలో 787 మంది గృహ నిర్భందం

  • Publish Date - March 21, 2020 / 01:07 AM IST

ఆంధ్రప్రదేశ్‌నూ కరోనా కలవరపెడుతోంది. ఏపీలో ఇప్పటి వరకు మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకుగురవుతున్నారు. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడికి అప్రమత్తమైంది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు పోగొట్టి ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నిస్తోంది. కరోనా కట్టడికి చర్యలు ముమ్మరం చేసింది.

మరోవైపు..కరోనా ఎఫెక్ట్ పలు రంగాలపై పడుతోంది. గన్నవరం విమానాశ్రయం నిర్మానుష్యంగా మారింది. రైల్వేస్టేషన్లు వెలవెలబోతున్నాయి. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆలయాలు, మాల్స్ మూడపడుతున్నాయి. ఆర్టీసీలో ప్రయాణికులు అంతంత మాత్రంగానే ఉంటున్నారు. కొందరు ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను గుర్తించి వారిని హోం క్వారంటైన్ లో ఉంచుతున్నారు.

కృష్ణా జిల్లాలో 787 మంది గృహ నిర్భందంలో ఉన్నారు. వీరిని వైద్య, ఆరోగ్యశాఖ పర్యవేక్షిస్తుంది. వారిలో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు కన్పిస్తే వెంటనే ఐసోలేషన్ పంపించేందుకు బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు జిల్లాలో 17 ఆసుపత్రుల్లో 81 బెడ్స్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 ర్యాపిడ్ రెస్పాన్స్  టీమ్‌లు పని చేస్తున్నాయి. 24 గంటలు పని చేసేలా రెండు కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.

* కరోనాపై సెంట్రల్‌ సర్కార్‌ యుద్ధం. 
* కరోనా ప్రభావంతో తగ్గిన జనాలు. 

* ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరు వ్యాపారులు.
* కరోనాపై ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌. 

* వైరస్‌ కట్టడికి పలు సూచనలు చేసిన సీఎం కేసీఆర్‌. 
* కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సీసీఎంబీని ఇవ్వాలని విజ్ఞప్తి. 
 

* ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు-మంత్రి ఆళ్లనాని. 
* విమాన సర్వీసులు రద్దు చేయాలని కోరాం-ఆళ్లనాని. 

Read More : తెలంగాణలో కరోనా : కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా