ఏపీలో 58కి చేరిన కరోనా కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 14 మందికి నిర్ధారణ

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న(మార్చి 31,2020) ఒక్క రోజే 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా

  • Publish Date - April 1, 2020 / 03:05 AM IST

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న(మార్చి 31,2020) ఒక్క రోజే 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న(మార్చి 31,2020) ఒక్క రోజే 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా బుధవారం(ఏప్రిల్ 1,2020) 14 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరంతా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారే. 30మందికి పరీక్షలు చేయగా, 14మందికి పాజిటివ్, 10 మందికి నెగిటివ్ వచ్చిందని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు. మరో 6 నమూనాల రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. మొత్తంగా ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 58కి చేరింది. కాగా, ఈ తాజా కేసులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించాల్సి ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసు వివరాలను కలెక్టర్ రేవు ముత్యాలరాజు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు నివేదిక పంపారు.

నిన్నటి వరకు పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. అలాంటిది ఒకేసారి 14 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. కరోనా సోకిన వారంతా ఢిల్లీ నుంచి వచ్చిన వారిగా తెలుస్తోంది.

* ఏలూరులో 6 కరోనా కేసులు
* భీమవరంలో 2
* పెనుగొండలో 2 కేసులు
* ఉండి, గుంగుగొలను, ఆకివీడు, నారాయణపురంలో ఒక్కో కేసు నమోదు
* భారత్ లో 1619 కరోనా కేసులు, 46 మరణాలు, కోలుకున్న వారు 142మంది
* ప్రపంచవ్యాప్తంగా 8.57లక్షల కరోనా కేసులు, 42వేల 100 మరణాలు
* ఇటలీలో ఒక్క రోజే 837 మంది, స్పెయిన్ లో 748 మంది, ఫ్రాన్స్ లో 499 మంది, బ్రిటన్ లో 381 మంది, ఇరాన్ లో 141 మంది, నెదర్లాండ్స్ లో 175 మంది, బెల్జియంలో 192 మంది మృతి
* అమెరికాలో ఇప్పటివరకు 3వేల 867 మంది మరణం

Also Read | దొరికాడు, తెలంగాణలో మద్యం షాపులు తెరుస్తారని ప్రచారం చేసిన యువకుడు అరెస్ట్