AP Coronavirus, ఒక్క రోజే 10 వేల మంది కోలుకున్నారు

  • Publish Date - September 20, 2020 / 06:47 PM IST

ఏపీలో కరోనా కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకున్నా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 70 వేల 455 నమూనాలను టెస్టులు చేయగా..7 వేల 738 మందికి వైరస్ సోకిందని నిర్ధారించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఒక్క రోజులో 10 వేల 608 మంది వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపింది.


మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 6 లక్షల 25 వేల 514కి చేరనట్లైంది. 24 గంటల వ్యవధిలో 57 మంది మరణించారు. ఇప్పటి వరకు 5 వేల 349 మంది చనిపోయారు. ప్రస్తుతం 78 వేల 836 యాక్టివ్ కేసులున్నాయి.


కృష్ణాలో 8 మంది, అనంతపూర్ లో ఏడుగురు, చిత్తూరులో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖలో ఆరుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కర్నూలులో నలుగురు, కడపలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు మరణించారని వెల్లడించింది.


జిల్లాలో కేసులు (24 గంటల్ల)ో వివరాలు :
అనంతపురం 539. చిత్తూరు 794. ఈస్ట్ గోదావరి 1260. గుంటూరు 582. కడప 267. కృష్ణా 439. కర్నూలు 275. నెల్లూరు 444. ప్రకాశం 869. శ్రీకాకుళం 476. విశాఖ 342. విజయనగరం 446. వెస్ట్ గోదావరి 1005. మొత్తం 7738