COVID 19 in AP : 24 గంటల్లో 357 కేసులు, నలుగురు మృతి

COVID 19 in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 357 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 59 వేల 551 శాంపిల్స్ పరీక్షించినట్లు, అనంతపూర్, వైఎస్ఆర్ కడప, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 355 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, గురువారం వరకు రాష్ట్రంలో 1,14,74,797 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది.

మొత్తంగా ఏపీ రాష్ట్రంలో 8 లక్షల 80 వేల 075కి కరోనా కేసులు చేరుకున్నాయి. 7 వేల 089 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 3 వేల 862 యాక్టివ్ కేసులు ఉండగా..8 లక్షల 69 వేల 124 మంది డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాల వారీగా :
అనంతపురం : 27. చిత్తూరు 54. ఈస్ట్ గోదావరి : 58. గుంటూరు : 42. కడప : 14. కృష్ణా : 54. కర్నూలు : 09. నెల్లూరు : 28. ప్రకాశం : 09. శ్రీకాకుళం : 16. విశాఖపట్టణం : 28. విజయనగరం : 04. వెస్ట్ గోదావరి :
14. మొత్తం 357.

రాష్ట్రాల వారీగా శాంపిల్స్ :
ఆంధ్రప్రదేశ్ : 1,14,74,797. కేరళ : 75,08,489. కర్నాటక : 1,33,17,070. తమిళనాడు : 1,36,59,300. తెలంగాణ : 65,66,602. గుజరాత్ : 92,17,823. మహారాష్ట్ర : 1,22,12,384. రాజస్థాన్ : 50,71,192. మధ్యప్రదేశ్ : 44,20,566. ఇండియా : 16,42,69,021.