ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిపోతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 8,601 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
ఏపీలోని పలు జిల్లాల్లో నెల్లూరులో 10 మంది, ప్రకాశంలో 10 మంది, తూర్పు గోదావరిలో 9 మంది, గుంటూరులో 9 మంది, చిత్తూరులో 8 మంది, కడపలో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, విశాఖపట్టణంలో ఏడుగురు, అనంతపూర్‌లో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఒకరు చనిపోయారు. మొత్తంగా 86 మంది మరణించారు.
గడిచిన 24 గంటల్లో 8,741 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 32,92, 501 శాంపిల్స్ పరీక్షించారు.రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,712కి చేరింది.
ప్రస్తుతం ఏపీలో మొత్తం 89,516 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,368 మంది కరోనాతో మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.. ఈ ఒక్క జిల్లాలోనే 50,686 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా టెస్టుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 54,463 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు 32,92,501 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది.