CPI Narayana కామెంట్స్: చెట్టుకు కట్టేస్తాం.. వేళ్లు నరికేస్తాం..

సీపీఐ జాతీయ నాయకులు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తే సిబ్బందిని చెట్టుకు కట్టేసి, వేళ్ళు నరికేస్తామని హెచ్చరించారు.

Narayana

Narayana’s sensational comments : సీపీఐ జాతీయ నాయకులు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తే సిబ్బందిని చెట్టుకు కట్టేసి, వేళ్ళు నరికేస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

చిత్తూరు – తచ్చూరు జాతీయ రహదారి కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమన్నారు. భూములు ఇవ్వకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని రైతులను బెదిరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. అలా చేస్తే మీ చేతి వేళ్ళు కూడా కట్ చేస్తామని సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు.

బలవంతంగా సంతకాలు తీసుకునేందుకు అధికారులు రైతుల ఇంటి వద్దకు వస్తే వారిని చెట్టుకు కట్టేస్తామని చెప్పారు. బాధితులకు అండగా ఉండడం కోసమే గ్రామాల వెంబడి సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు.