Raghu Rama Krishna Raju : RRR సంచలనం.. నా గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తించా..

2021లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు పెట్టి సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాత్రంతా తనను సీఐడీ కార్యాలయంలోనే ఉంచి విచారణ పేరుతో తనపై హత్యాయత్నం చేశారని ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు చేశారు.

Raghu Rama Krishna Raju : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దర్యాఫ్తును వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల గుర్తింపు ప్ర్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా రఘురామకృష్ణరాజు గుంటూరు జైలుకి వెళ్లారు. జైల్లో నిందితుల గుర్తింపు పరేడ్ లో ఆయన పాల్గొన్నారు. గుంటూరు జిల్లా న్యాయమూర్తి సమక్షంలో ఈ పరేడ్ జరిగింది. పరేడ్ అనంతరం ఆయన మాట్లాడారు.

Also Read : నకిలీ ఐఏఎస్ జంట కేసులో కొత్త ట్విస్ట్… చివరకు అద్దెకు ఉంటున్న ఇంటిలోనూ..

నా గుండెలపై కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి పెట్టుకున్న మాస్క్ జారిపోయింది..
తన స్టేట్ మెంట్ రికార్ట్ చేశారని తెలిపారు. నా గుండెలపై కూర్చుని నన్ను కొట్టిన వ్యక్తిని నేను గుర్తించానని ఆర్ఆర్ఆర్ తెలిపారు. నా గుండెలపై కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి పెట్టుకున్న మాస్క్ జారి పోయిందన్నారు. నాపై కూర్చుని ఫోన్ ఓపెన్ చేయాలని కూడా అడిగాడని తెలిపారు. మొత్తం 5 మంది వచ్చినట్లు గుర్తించానన్నారు. గుడివాడలో టీడీపీని తులసి బాబే బతికించాడని ప్రచారం చేసుకుంటున్నారు.. నేనైతే టీడీపీ అధిష్టానానికి తులసి బాబుపై ఫిర్యాదు చేయలేదన్నారు.

తులసిబాబుకు టీడీపీ సభ్యత్వం లేదని తెలిసింది..
తులసి బాబుకు టీడీపీ సభ్యత్వం లేదని తెలిసిందన్నారు రఘురామక్రిష్ణరాజు. ఇక నుండి తులసి బాబును పక్కన పెడతారని అనుకుంటున్నానని చెప్పారు. తులసి బాబుతో పాటు వచ్చిన మిగిలిన నలుగురు గురించి మీడియా ముందు చెప్పలేనన్నారు. ఇక, జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని పోలీసులు అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను అని రఘురామ అన్నారు.

Also Read : విజయసాయిరెడ్డి రాజీనామాపై బీజేపీ మౌనం వెనుక..?

నా కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది..
నన్ను చంపాలన్న ఉద్దేశం కూడా నాడు ఉందేమోనని ఊహిస్తున్నా అని ఆయన వెల్లడించారు. విచారణ కొంత జాప్యమైనా నిందితులు అందరూ దొరికిపోతారని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఏ1, ఏ2 లను ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన అడిగారు. తన కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు రఘురామకృష్ణరాజు.

2021లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో సీడీఐ అధికారులు ఆయనను 2021 మే 14న అరెస్ట్ చేశారు. ఆ రోజు రాత్రంతా సీడీఐ ఆఫీసులోనే ఉంచారు. కాగా, విచారణ పేరుతో తనపై హత్యాయత్నం జరిగిందని రఘరామకృష్ణరాజు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై ఆయన నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

ఈ కేసులో ఐపీఎస్ అధికారులు సైతం నిందితులుగా ఉన్నారు. దీంతో విచారణ అధికారిగా ప్రజాశం జిల్లా ఎస్పీని ప్రభుత్వం నియమించింది. ఇక, ఈ కేసు విచారణలో భాగంగా అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయ్ పాల్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. రఘురామపై దాడి కేసులో తులసిబాబు, మరో వ్యక్తి నిందితులుగా ఉన్నారు.