Cyber Crime Arrest: సీఎంను చంపుతానంటూ పోస్ట్.. జనసేన సపోర్టర్ అరెస్ట్!

సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు.

Cyber Crime Arrest: సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ క్రైం ఎస్‌పీ రాధిక ఈమేరకు సమావేశం ఏర్పాటుచేసి నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీఎంను చంపుతానంటూ రాజుపాలెపు ఫణి అనే జనసేన సపోర్టర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టినట్లు వెల్లడించారు. సీఎంపై బెదిరింపులకు పాల్పడిన జనసేన మద్దతుదారుడ్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

కన్నాబాయ్ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ముఖ్యమంత్రిని మానవబాంబై చంపేస్తానంటూ పోస్ట్ చేశారు. కన్నాబాయ్ కొంతకాలంగా టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉన్నాడు. సదరు వ్యక్తి జనసేనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అకౌంట్ డిలిట్ చేసినా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా సదరు వ్యక్తులను కనిపెట్టగలమని స్పష్టం చేశారు రాధిక.

అధునాతనమైన టెక్నాలజీని ఇప్పుడు సైబర్ క్రైమ్ వినియోగిస్తుందని, అనుచిత పోస్టులు పెట్టే ముందు జాగ్రత్త వహించాలని కోరారు సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక. చట్టవిరుద్ధంగా పోస్టులు పెట్టేవారిపై చర్యలు ఉంటాయని ఎస్పీ రాధిక స్పష్టం చేశారు. విచారణలో పవన్ అభిమానినని, జనసేన మద్దతుదారుడినని ఫణి చెప్పాడని వివరించారు రాధిక.

ట్రెండింగ్ వార్తలు