Cyclone Asani Impact All Flights Cancelled At Andhras Vizag Airport
Cyclone Asani : బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతోంది. దిశను మార్చుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు దూసుకెళ్తోంది. కోనసీమ కాకినాడ సముద్ర తీరం వెంబడి అసని తుపాను పయనిస్తోంది. తుపాను ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. సముద్ర తీర ప్రాంతంలో కెరటాలు ఎగిసి పడుతున్నాయి. తీరం వెంబడి పయనించే సమయంలో ఈదురు గాలిలుతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. కాకినాడ కోనసీమ జిల్లాల తీర ప్రాంతం వెంబడి సుమారు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
ఎగిసి పడుతున్న కెరటాలకు ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోంది. తహిసిల్దారు కార్యాలయాలలో కంట్రోల్ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. తీరప్రాంత మండలాల్లోని ఉద్యోగులను అధికారులు అప్రమత్తం చేశారు. మూడు జిల్లాల్లో పోలీస్, రెవిన్యూ, ఫైర్, మిగిలిన శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వీస్తున్న ఈదురు గాలులతో వర్షపాతం నమోదైంది.
Cyclone Asani Impact All Flights Cancelled At Andhras Vizag Airport
అసని తుపాను ఎఫెక్టుతో ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. అసని తుపాను దెబ్బకు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని విమాన సర్వీసులను మళ్లిస్తున్నారు. మంగళవారం 19 వరకు విమాన సర్వీసులను రద్దు చేశారు. బుధవారం ఇండిగో 23 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ – విశాఖ, బెంగళూరు – విశాఖ సర్వీసులను రద్దు చేసుకుంది. ఎయిర్ ఇండియా సర్వీసులను కూడా రద్దు చేసుకున్నారు. ముంబై – రాయ్ పూర్, విశాఖ-ఢిల్లీ సర్వీసులను రద్దు చేశారు. విమానాల ల్యాంగిండ్‌కు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడమే కారణమని ఎయిర్ పోర్టు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు.. అసని తుపాను దెబ్బకు దక్షిణ మధ్య రైల్వే బుధవారం పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని రీషెడ్యూల్ చేసింది. మొత్తంగా 37 రైళ్లు రద్దయ్యాయి. ఇందులో విజయవాడ- మచిలిపట్నం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్ – నిడదవోలు, నిడదవోలు – నర్సాపూర్, నర్సాపూర్ – విజయవాడ, విజయవాడ – నర్సాపూర్, నిడదవోలు – భీమవరం జంక్షన్, భీమవరం జంక్షన్ – నిడదవోలు, మచిలీపట్నం – గుడివాడ, భీమవరం జంక్షన్ – మచిలీపట్నం, గుడివాడ – మచిలీపట్నం, నర్సాపూర్ – గుంటూరు, గుంటూరు – నర్సాపూర్, కాకినాడ పోర్ట్ – విజయవాడ రైళ్లను రద్దు చేసింది.
Read Also : Asani Cyclone: తగ్గని అసని బీభత్సం.. గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ