Asani Cyclone: తగ్గని అసని బీభత్సం.. గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన అసానీ తుఫాన్ రెండు రాష్ట్రాలను గడగడలాడిస్తోంది. అసని తీవ్ర తుఫాన్ మరికొన్ని గంటల్లో కోస్తాంధ్ర తీరం దాటనుంది.

Asani Cyclone: తగ్గని అసని బీభత్సం.. గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ

Asani (1)

Asani Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అసానీ తుఫాన్ రెండు రాష్ట్రాలను గడగడలాడిస్తోంది. అసని తీవ్ర తుఫాన్ మరికొన్ని గంటల్లో కోస్తాంధ్ర తీరం దాటనుంది. ఈ సమయంలో భీకర గాలులతో వర్షం దంచికొట్టే అవకాశాలు ఉన్నాయి. పెను తుఫాన్‌గా ఆవిర్భవించిన అనంతరం ఏపీ-ఒడిశా తీర ప్రాంతం వైపు దూసుకొచ్చిన అసని ప్రభావంతో ఏపీలో తీర ప్రాంత జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. పలు జిల్లాలలో భారీ వర్షాలు దంచికొట్టగా బుధవారం కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Cyclone Asani : అసని తుపానుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష

ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు ప్రకాశం, నెల్లూరుల్లో మంగళవారం భారీ వర్షం కురవగా.. ఇదే పరిస్థితి కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ కనిపించింది. అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా కనిపించింది. ఒడిశాలోని గజపతి, కటక్, భువనేశ్వర్, పూరీ జిల్లాలపై అసానీ ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తుంది. అసని బుధవారం ఉదయానికి మచిలీపట్నం–బాపట్ల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Cyclone Asani : మూడు రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిధ్ధం

ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా మలుపు తిరిగి సముద్రంలోకి వెళ్తుందని.. అక్కడి నుంచి మరింత బలహీనపడి కాకినాడ మీదుగా విశాఖపట్నం తీరం వైపు వస్తుందని.. గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాకినాడ, విశాఖ పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 జారీ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ సిగ్నల్ జారీ అయింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది.

Cyclone Asani: హుద్ హుద్ తరువాత భారీ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి

తుఫాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదా పడగా.. హుద్ హుద్ తుఫాన్ తరువాత విశాఖపట్నంలో మళ్ళీ పెను గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు సుమారు 80-90 కిలోమీటర్ల వేగంతో వీస్తుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. మరోవైపు తమిళనాడు తీరప్రాంతంలో కూడా అసని ప్రభావంతో సముద్రంలో 5 అడుగుల మేర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండగా.. సముద్రం దాదాపు 150 మీటర్లు మేర ముందుకొచ్చింది.