Cyclone Asani: హుద్ హుద్ తరువాత భారీ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి

2014లో హుద్ హుద్ తుఫాను బీభత్సం తర్వాత విశాఖ తీరానికి 13 నెంబర్ హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.

Cyclone Asani: హుద్ హుద్ తరువాత భారీ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి

Asani

Cyclone Asani: బంగాళఖాతంలో అసని తుఫాను తీవ్ర రూపం దాల్చింది. మంగళవారం మధ్యాహ్నానికి దిశ మార్చుకున్న తుఫాను గంటకు 25 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతుంది. ప్రస్తుతం కాకినాడకు 210 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ., గోపాలపూర్ కు 530 కి.మీ., పూరీకు 630 కి.మీ దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్లు విశాఖ వాతావరణశాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనించి..బుధవారం ఉదయానికి కాకినాడ -విశాఖపట్నం తీరాలకు దగ్గరగా చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా అసని తుఫాను నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ సునంద సూచించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంపై అసని తుఫాను ప్రభావం 24 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు.

Also read:Asani Cyclone Live Updates: దిశ మార్చుకున్న అసని తుపాను.. రేపు తీరం దాటే చాన్స్ – లైవ్ అప్ డేట్స్

ఉమ్మడి గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీవ్ర తుఫానుగా అసని రూపాంతరం చెందిందని వాతావరణశాఖ అధికారి తెలిపారు. తుఫాను కాకినాడ విశాఖపట్నం మధ్య తీరానికి దగ్గరగా వచ్చి మళ్లీ తీరం వెంబడి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగాళఖాతంలోకి వెళుతుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల తీరంలో బలమైన గాలులు వీస్తాయని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరం వెంబడి 48 నుంచి 68 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని సునంద పేర్కొన్నారు.

Also read:Cyclone Asani: అసనికి తోడుగా బంగాళఖాతంలో ద్రోణి: తెలంగాణకు వర్ష సూచన

కాకినాడ తీరం నుంచి విశాఖ తీరం వరకు ఉన్న తీరప్రాంతంలోని ఓడరేవుల్లో పదో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన ఓడరేవుల్లో 8 వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. విశాఖ తీరంలో 13వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. 2014లో హుద్ హుద్ తుఫాను బీభత్సం తర్వాత విశాఖ తీరానికి 13 నెంబర్ హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.

Also read:Asani Cyclone : తీవ్ర తుఫానుగా అసాని.. తీర ప్రాంత ప్రజలకు అలర్ట్