Asani Cyclone : తీవ్ర తుఫానుగా అసాని.. తీర ప్రాంత ప్రజలకు అలర్ట్

తుఫాన్ ప్రభావంతో 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

Asani Cyclone : తీవ్ర తుఫానుగా అసాని.. తీర ప్రాంత ప్రజలకు అలర్ట్

Asani (2)

Asani cyclone : అసాని తీవ్ర తుఫానుగా బంగాళాఖాతంలో కొనసాగుతోంది. విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. క్రమంగా దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ, సముద్రంలోనే క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.

తుఫాన్ ప్రభావంతో 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల అధికారి జగన్నాథ కుమార్ పేర్కొన్నారు.

Cyclone Asani : ముంచుకొస్తున్న అసని తుపాను.. తీరప్రాంతాల్లో అల్లకల్లోలం..!

అసాని తుఫాన్ దూసుకొస్తోంది. అసాని తుఫాన్ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. సముద్ర తీర ప్రాంతంలో కెరటాలు ఎగిసి పడుతున్నాయి. కాకినాడ కోనసీమ జిల్లాల తీర ప్రాంతం వెంబడి సుమారు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశముంది. ఆ తర్వాత దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్యంగా ఒడిశా తీరం వెంట పయనించే అవకాశముంది. ఈ క్రమంలోనే తీవ్రత తగ్గి తుపానుగా బలహీనపడొచ్చు.

మరింత బలహీనమై తీవ్ర వాయుగుండం వాయవ్య బంగళాఖాతంలోకి పయనించే అవకాశముందని అంచనా వేశారు. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న తుపాను సోమవారం రాత్రికి విశాఖకు 350 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అది తీరానికి దగ్గరగా వస్తే గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని, తీరానికి దూరంగా పయనిస్తే ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

Cyclone Asani: ఏపీవైపు దూసుకొస్తున్న ‘అసని’.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం

అసాని తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో విశాఖకు రావాల్సిన విమానాలు వెను దిరిగాయి. కర్నూలు, బెంగుళూరు, హైదరాబాద్ నుంచి రావాల్సిన విమానాలు వెనక్కి వెళ్లిపోయాయి. అలాగే విజయవాడ, రాజమహేంద్రవరం, హైదరాబాద్, ముంబై, చెన్నై నుంచి వచ్చే ఇండిగో విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు.

మరోవైపు తుపాను ప్రభావంతో ఈదురు గాలులు వీస్తుండటంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో మంగళవారం నుంచి గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.