Cyclone Asani : ముంచుకొస్తున్న అసని తుపాను.. తీరప్రాంతాల్లో అల్లకల్లోలం..!

Cyclone Asani : అసని తుపాను దూసుకొస్తోంది. అసని తుఫాన్ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. సముద్ర తీర ప్రాంతంలో కెరటాలు ఎగిసి పడుతున్నాయి.

Cyclone Asani : ముంచుకొస్తున్న అసని తుపాను.. తీరప్రాంతాల్లో అల్లకల్లోలం..!

Cyclone Asani Moving At 50 Kmph, Storm Lies 350 Km From Visakhapatnam

Cyclone Asani : అసని తుపాను దూసుకొస్తోంది. అసని తుఫాన్ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. సముద్ర తీర ప్రాంతంలో కెరటాలు ఎగిసి పడుతున్నాయి. కాకినాడ కోనసీమ జిల్లాల తీర ప్రాంతం వెంబడి సుమారు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశముంది. ఆ తర్వాత దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్యంగా ఒడిశా తీరం వెంట పయనించే అవకాశముంది. ఈ క్రమంలోనే తీవ్రత తగ్గి తుపానుగా బలహీనపడొచ్చు.

మరింత బలహీనమై తీవ్ర వాయుగుండం వాయవ్య బంగళాఖాతంలోకి పయనించే అవకాశముందని అంచనా వేశారు. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న తుపాను సోమవారం రాత్రికి విశాఖకు 350 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అది తీరానికి దగ్గరగా వస్తే గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని, తీరానికి దూరంగా పయనిస్తే ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

Cyclone Asani Moving At 50 Kmph, Storm Lies 350 Km From Visakhapatnam (1)

Cyclone Asani Moving At 50 Kmph, Storm Lies 350 Km From Visakhapatnam

రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, విజయవాడ, విశాఖపట్టణం, శ్రీకాకుళంలోనే గాక ఒడీశాలోని కోస్తా జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. గాలులు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. ఎగసి పడుతున్న కెరటాల ప్రభావానికి ఉప్పాడ తీర ప్రాంతం తీవ్రంగా కోతకు గురవుతోంది. మరోవైపు తుపాను ప్రభావంతో వాతావారణం అనుకూలంగా లేకపోవడంతో విశాఖకు విమాన సర్వీసులను రద్దు చేశారు.

విజయవాడ, రాజమహేంద్రవరం, హైదరాబాద్‌, ముంబై, చెన్నై నుంచి విశాఖకు వచ్చే ఇండిగో విమాన సర్వీసులన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేశారు. ఆర్డీవో కార్యాలయాల కంట్రోల్ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే తీరప్రాంత మండలాల్లో ఉన్న ఉద్యోగులను సైతం అధికారులు అప్రమత్తం చేశారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో వర్షపాతం నమోదైంది.

Read Also : Asani Cyclone : అసానితో ఏపీకి ఎలాంటి ముప్పు లేదు : విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్