Cyclone Asani: ఏపీవైపు దూసుకొస్తున్న ‘అసని’.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం

ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకొస్తుంది. ఇప్పటికే తీవ్ర తుపానుగా మారిన అసని.. పోర్ట్ బ్లెయిర్‌కు వాయువ్య దిశగా 570 కిలో మీటర్ల దూరంలో..

Cyclone Asani: ఏపీవైపు దూసుకొస్తున్న ‘అసని’.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం

Cyclone Asani

Cyclone Asani: ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకొస్తుంది. ఇప్పటికే తీవ్ర తుపానుగా మారిన అసని.. పోర్ట్ బ్లెయిర్‌కు వాయువ్య దిశగా 570 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం రాత్రికి ఉత్తర కొస్తాంధ్ర, ఒడిశా తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాన్ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తుపాను ప్రభావంతో తీరంలో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటలకు 40 నుంచి 50 కిలో మీటర్లు, గరిష్టంగా 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ హెచ్చరించారు. తుపాను కారణంగా విశాఖపట్టణం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Cyclone Asani Warning : దూసుకొస్తున్న అసని తుఫాను.. ఏపీ ప్రజలకు హెచ్చరిక

అసని తుపాను తీరానికి దగ్గరగా వచ్చిన తరువాత దిశ మార్చుకొని బెంగాల్ వైపు పయణిస్తుందని, ఒకవేళ అలా జరిగినా ఏపీ తీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పార్వతీపురం, విశాఖపట్టణం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు రోజులు పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Cyclone Asani: బలపడిన వాయుగుండం.. నేడు తుపానుగా మారే చాన్స్

మరోవైపు తుపాను ఒడిశా తీరానికి దగ్గరగా వస్తోందని తొలుత వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మంగళవారం నాటికి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం గంజాం, పూరీ, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపాడ కలెక్టర్‌లకు సూచించింది.