Asani Cyclone Live Updates: రేపు తీరం దాటనున్న అసని తుపాను.. కేంద్ర హోం శాఖ రివ్యూ – లైవ్ అప్ డేట్స్
అసని తుపాను.. దిశ మార్చుకుంది. రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో.. ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి.

Asani
అసని తుపాను.. దిశ మార్చుకుంది. రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో.. ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా అసని దిశ మార్చుకున్న ప్రభావం.. కృష్ణా, గుంటూరు జిల్లాలపైనా పడింది. ఆ రెండు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కేంద్ర హోం శాఖ సైతం.. తాజా పరిస్థితిపై వాతావరణ శాఖతో నిరంతరం సంప్రదింపులు చేస్తోంది.