Gulab Cyclone : ఏపీని గజగజలాడిస్తున్న గులాబ్‌!

ఏపీని గులాబ్‌ తుపాను గజగజలాడించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పట్టణాలు, పల్లెలు జలమయం అయ్యాయి. గులాబ్‌ తుపాను శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించింది.

Gulab Cyclone : ఏపీని గులాబ్‌ తుపాను గజగజలాడించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పట్టణాలు, పల్లెలు జలమయం అయ్యాయి. గులాబ్‌ తుపాను శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించింది. గార, నర్సంపేట, పోలాకి, సంతబొమ్మాళి, మందస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాల్లో భారీ వర్షం విరుచుకుపడింది. లక్కుపురం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సంత బొమ్మాళి, మందస, సోంపేట మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది.
Cyclone Gulab: నేడు, రేపు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

గెడ్డకంచరాంలో హైస్కూల్ ప్రహరీ గోడ కూలిపోయి 9 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక విజయవాడ దుర్గమ్మ దర్శనంపై కూడా తుపాను ఎఫెక్ట్ పడింది. కొండపైకి వెళ్లే ఘాట్‌ రోడ్డును మూసివేశారు. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగే పడే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా రాకపోకలు నిలిపివేశారు. విశాఖ నగరం నీట మునిగింది. డుంబ్రిగుడ మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గసబ పంచాయతీ నోగెలి బ్రిడ్జి దగ్గర వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఏపీలో తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు జగన్‌. వర్షాలు, వరదలతో ఎవరైనా మరణిస్తే.. వారి కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటించారు. సహాయక శిబిరాల్లో ఉంటున్న వారికి నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు జగన్‌. వారు ఇంటికి వెళ్లేసమయంలో వెయ్యి రూపాయలు సాయంగా అందజేయాలని ఆదేశించారు. ఇళ్లల్లోకి నీరు చేరి ఇబ్బందుల పడుతున్న వారికి సైతం వెయ్యి రూపాయల తక్షణ సాయం అందించాలన్నారు ఏపీ సీఎం.
Telangana Govt : గులాబ్ ఎఫెక్ట్.. రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం

ట్రెండింగ్ వార్తలు