Telangana Govt : గులాబ్ ఎఫెక్ట్.. రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం

గులాబ్ తుఫాన్ తీరం దాటాక తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కుండపోత వానలతో తెలంగాణను వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దాం

Telangana Govt : గులాబ్ ఎఫెక్ట్.. రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Telangana Govt

Telangana Govt : గులాబ్ తుఫాన్ తీరం దాటాక తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కుండపోత వానలతో తెలంగాణను వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దాంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం(సెప్టెంబర్ 28,2021) సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ ప్రకటన చేసింది.

సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షబీభత్సం నెలకొనడంతో మంత్రి హరీశ్ రావు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా, మండల, గ్రామాల వారీగా సంబంధిత అధికారులు ఆయా కేంద్రాల్లో ఉండాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, కంట్రోల్ రూమ్ ను ఆశ్రయించేవారి పట్ల సత్వరమే స్పందించాలని అన్నారు.

Google Chrome వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. వెంటనే ఈ పని చేయండి

కాగా, రానున్న రెండ్రోజుల పాటు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో, ఈ నెల 30న జరగాల్సిన ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (పీఈ సెట్) అక్టోబరు 23కి వాయిదా వేస్తున్నట్టు కన్వీనర్ తెలిపారు. అంతేకాదు, మంగళవారం జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సబ్ కమిటీ సమావేశం కూడా వాయిదా పడింది.

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 28, 29న జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. మిగిలిన తేదీల్లో జరిగే పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, వాయిదాపడిన పరీక్షల కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు.

గులాబ్ ఎఫెక్ట్ తో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరాన్ని సోమవారం సాయంత్రం అతి భారీవర్షం ముంచెత్తుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Mango Leaves : షుగర్ లెవల్స్ తగ్గించే మామిడాకులు…ఎలా ఉపయోగించాలో తెలుసా?

నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో గత మూడు గంటలుగా భారీ వర్షం పడుతుండడంతో ప్రధాన రహదారులపై వరద పోటెత్తింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయం కోసం 040-23202813 నెంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్(అతి భారీవర్షాలు) ప్రకటించారు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్ధిపేట, సిరిసిల్ల, జనగామ, పెద్దపల్లి, హన్మకొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.